Rahul Gandhi bike Taxi ride in Goa: కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం కోసం గోవా వెళ్లిన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కొద్ది సేపు బైక్​ ట్యాక్సీ ప్రయాణం చేశారు. అక్కడ స్థానికంగా ఉండే బైక్​ ట్యాక్సీలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు సంబంధించిన వీడియోను గోవా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది.


ముందు ఓ వ్యక్తి బైక్​ (Rahul Gandhi on Taxi bike) నడిపిస్తుండగా.. రాహుల్ గాంధీ వెనక కూర్చుని ప్రయాణించారు. బైకర్​ సహా రాహుల్​ గాంధీ కూడా హెల్మెంట్​, మాస్క్ ధరించి ఉన్నారు.



Also read: National Media Awards 2021: జాతీయ మీడియా అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానం, అర్హత వివరాలివే


Also read: Air India privatization: ఎంపీలకు షాకిచ్చిన కేంద్రం- ఎయిర్ఇండియా ఉచిత టికెట్లు బంద్!


గోవాలో రాహుల్ గాంధీ పర్యటన ఇలా..


ఓక రోజు పర్యటనలో భాగంగా ఈ ఉదయం గోవాకు చేరుకున్నారు రాహుల్​ గాంధీ. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ముందస్తు ప్రచారంలో పాల్గన్నారు. తొలుత వ‌ల్సావో గ్రామంలో మ‌త్స్య‌కారుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్​ గాంధీ. నైరుతి రైల్వే చేపట్టిన డబుల్ ట్రాకింగ్ ప్రాజెక్టును వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని బొగ్గు హబ్​గా మార్చేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రాహుల్ తాజాగా స్పందించారు.


Also read: Covid Cases : కాస్త అదుపులో కరోనా వైరస్, 14,313 మందికి కోవిడ్‌ పాజిటివ్‌


Also read: Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా


హామీలను నిలబెట్టుకుంటాం..


అయితే తాము ఇతర పార్టీల్లా కాదని రూహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏదైనా మటిస్తే అది నెరవర్చుతామని స్పష్టం చేశారు. పంజాబ్​, కర్ణాటకల్లో ఇలానే చేశామని వివరించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటేనే తమకు విశ్వసనీయత ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఈ ప్రసంగం తర్వాత రాహుల్​.. ప‌నాజీలోని అజాద్ మైదాన్​లో ఉన్న అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద నివాళులు అర్పించేందుకు బయ‌లుదేరారు. ఈ సమయంలోనే బాంబోలిమ్ నుంచి అజాద్ మైదాన్ వరకు బైక్​ ట్యాక్సీపై ప్రయాణించారు రాహుల్​ గాంధీ.


Also read: Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??


Also read: West Bengal: పశ్చిమ బెంగాల్ లో పాన్‌ మసాలా, గుట్కాపై నిషేధం..నవంబరు 7 నుంచి అమల్లోకి..!


బీజేపీపై విమర్శలు..


రాహుల్​ గాంధీ తన ప్రచారంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ విద్వేశాలను రెచ్చగొడుతుందన్నారు. తాము మాత్రం ప్రేమతో ప్రజల మనసు గెలుచుకుంటామని తెలిపారు.


పెట్రోల్, డీజిల్ ధరలపై పెంపుతో వారికే లాభం..


రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సన్నిహిత వ్యాపారులే పెరిగిన ఇంధన ధరలతో లాభాలను గడిస్తున్నారని ఆరోపించారు.


కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా ప్ర‌జ‌ల‌పై పెట్రో భారాలు మోపుతున్నార‌ని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 


Also read: Ind vs Pak: India పై పాకిస్తాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న ఘటనల్లో ఐదుగురు అరెస్ట్


Also read: ZEEL, invesco EGM: జీ ఎంటర్‌టైన్మెంట్‌కి అనుకూలంగా బాంబే హై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe