Celebrating Pakistan's win over India during T20 World Cup: న్యూ ఢిల్లీ: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ ఓటమి భారత గడ్డపై ఉన్న భారతీయులనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఎంతగానో ఆవేదనకు గురిచేసింది. చిరకాల ప్రత్యర్థిపై గెలుస్తామనే ధీమాతో ఉన్న భారత్ ఒక్కసారిగా ఓటమిపాలవడాన్ని పాకిస్థానీయులు తప్ప ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. కానీ కొంతమంది దేశ ద్రోహులు మాత్రం భారత గడ్డపైనే ఉంటూ టీమిండియా ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకున్నారనే వార్త తాజాగా వెలుగులోకొచ్చింది. భారత్‌పై పాకిస్థాన్ గెలుపును వేడుక చేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో యూపీ పోలీసులు (Uttar Pradesh police) ఏడుగురిపై కేసులు నమోదు చేయగా వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్‌ని సమర్థిస్తూ స్టేటస్‌లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఒక్క ఆగ్రా జిల్లా నుంచే ఇలాంటి కేసుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. వీరిపై ఐపిసి సెక్షన్స్ 505 (1)B, 153A, ఐటి యాక్టులోని 66 (F) సెక్షన్ ప్రకారం ఆగ్రా పోలీసులు కేసులు నమోదు చేశారు.
పాకిస్థాన్‌కి అనుకూలంగా వాట్సాప్ స్టేటస్‌లు పెట్టిన కేసులో లక్నో పోలీసులు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 151 CRPC, IPC 507 సెక్షన్స్ కింద ఇతడిపై కేసు నమోదు చేశామని లక్నో పోలీసులు తెలిపారు.
UP Police have booked 7 people in 5 districts and taken 4 people in custody for allegedly raising pro-Pak slogans or celebrating Pakistan's victory over India in the T20 Cricket World Cup match that took place on Oct 24: CMO pic.twitter.com/o1ceq5L7ED
— ANI UP (@ANINewsUP) October 27, 2021
Also read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే ? ముందున్న సవాళ్లు
యూపీలోని బరేలీలోనూ పాకిస్థాన్‌కి, పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్‌లు (Whatsapp status) పెట్టిన ఘటనలో మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. బరేలీ ఘటనలో తన ఫేస్‌బుక్ కవర్ పేజీగా, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌గా పాకిస్థాన్ జాతీయ జండా ఫోటోను అప్‌లోడ్ చేయడంతో పాటు పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ పలు పోస్టులు పెట్టినందుకుగాను ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నఫీసా అటారి అనే స్కూల్ టీచర్ సైతం పాకిస్థాన్ విజయాన్ని సెలబ్రేట్ (India vs Pakistan match) చేసుకుంటూ స్టేటస్ పెట్టగా అది వైరల్‌గా మారింది. దీంతో ఉదయ్‌పూర్‌లోని అంబమాతా పోలీసులు సదరు స్కూల్ టీచర్‌ని అదుపులోకి తీసుకుని (Rajastan school teacher arrested) ఆమె నుంచి ఆ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తంగా దేశవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఐదుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై దర్యాప్తు చేపట్టారు.
Also read : PAK vs NZ Match: ఆ రెండూ దృశ్యాలు అద్భుతాలే, పాక్ కివీస్ మ్యాచ్‌లో వైరల్ అవుతున్న దృశ్యాలు
Also read : T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దిశగా పాకిస్తాన్, 4 పాయింట్లతో అగ్రస్థానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ind vs Pak: India పై పాకిస్తాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న ఘటనల్లో ఐదుగురు అరెస్ట్