Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ, తెలంగాణల్లో మరో 5 రోజులు వర్షాలే
Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం రోజురోజుకూ ఎక్కువౌతోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3-5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
Heavy Rains Alert: ఆలస్యంగా దేశంలో ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు ఇప్పుడు దేశమంతా విస్తరిస్తున్నాయి. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా మరో 5 రోజుల వరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఓ వైపు నైరుతి రుతు పవనాల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కన్పిస్తోంది. రెండ్రోజుల్నించి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..ఇవాళ అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. అల్పపీడనం కారణంగా సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణలో కూడా రానున్న ఐదు రోజులు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదు కావచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని మరో 8 జిల్లాలలకు మోస్తరు వర్షసూచన ఉంది. రాష్ట్రంలోని కొమురం భీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వచ్చే 3-5 రోజుల వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
హైదరాబాద్‌లో అయితే వరుసగా రెండవరోజు భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్‌పి కాలనీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరి గుట్ట, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక సికింద్రాబాద్ పరిధిలో కూడా చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.
మరోవైపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని IMD హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజుల్లో అతివృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also read: Viral Video: నదిలో కొట్టుకుపోతున్న కారు, మహిళను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన స్థానికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook