Mamata Banerjee: మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల( West bengal assembly elections)సమయం సమీపించేకొద్దీ బీజేపీ, అధికార టీఎంసీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఇరుపార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకుంటున్నారు. మమతా బెనర్జీ కోడలికి బొగ్గు చోరీ కేసుతో సంబంధం అంటగట్టడంపై, బొగ్గు దొంగలని విమర్శించడంపై మమతా బెనర్జీ ( Mamata Banerjee)తీవ్రంగా మండిపడ్డారు.
బొగ్గు చోరీ కేసులో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా బెనర్జీకు సీబీఐ సమన్లు ( CBI Summons)జారీ చేయడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఓ మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. తమ కోడలికి బొగ్గు చోరీ కేసుతో సంబంధముందని అభాండాలు వేయడంపై ఆమె విరుచుకుపడ్డారు. తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చిందని..మీకు అసలు చరిత్రే లేదని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు తమ వెన్ను వంచేందుకు ప్రయత్నిస్తున్నారని..రాష్ట్రంలో చొచ్చుకొచ్చి లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించజాలదన్నారు.
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తానే గోల్ కీపర్ అని..బీజేపీకు సింగిల్ గోల్ కూడా రాదని దీదీ స్పష్టం చేశారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీ( Pm Narendra modi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ..దేశంలోనే అతి పెద్ద ఘర్షణదారుడని..డెమన్ అని అభివర్ణించారు. అమెరికా ఎన్నికల్లో ఓటమి పాలైన డోనాల్డ్ ట్రంప్ ( Donald trump)కు ఎదురైన పరిస్థితే మోదీ కోసం ఎదురుచూస్తోందన్నారు. ట్రంప్ మాదిరే మోదీకు ఓటమి తప్పదని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook