కరోనా వైరస్ (corona virus) కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ( Bharat Biotech)... వ్యాక్సిన్ ను ఆగస్టు 15లోగా అందుబాటులో కి తీసుకొస్తామంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభమే కానప్పుడు గడువు తేదీ నిర్దారణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తతండో ఐసీఎంఆర్(ICMR) దీనిపై వివరణ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు బారత్ సహా అన్ని అగ్రదేశాలు వ్యాక్సిన్ ( covid19 vaccine) తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ  పరిస్థితుల్లో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో (Naitonal institute of virology-pune) కలిసి అభివృద్ధి చేసిన బ్రాండ్ పేరు కోవ్యాక్జిన్ ( covaxin) . ఈ కంపెనీ వ్యాక్సిన్  ను ఆగస్టు 15 లోగా అందుబాటులో తీసుకొస్తామంటూ తేదీని ఖరారు చేస్తూ ఐసీఎంఆర్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ ఓ లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే బారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికి ప్రీ క్లినికల్ ట్రయల్స్ ( pre clinical trials) మాత్రం దాటింది.


క్లినికల్ ట్రయల్స్ అంటే మనుష్యులపై ఫేజ్ 1, 2 ప్రయోగాలకు డీసీజీఐ (DCGI) అనుమతిచ్చింది. ఈ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ (ICMR) సంస్థ దేశవ్యాప్తంగా 12 సంస్థల్ని గుర్తించింది. ఈ సంస్థల్లో ఈ ప్రయోగాలు ఇంకా ప్రారంభం కావల్సి ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 15లోగా వ్యాక్సిన్ ఎలా సాధ్యమవుతుందంటూ నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాల్ని నివృత్తి చేస్తూ ఐసీఎంఆర్ ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. Also read: Karnataka: కర్ణాటకలో కరోనా కల్లోలం: 32 మంది పదో తరగతి విద్యార్ధులకు సోకిన కరోనా


ఐసీఎంఆర్ ఏం చెప్పింది: 


దేశంలో ఉన్న అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకుని వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులో తీసుకొచ్చే క్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తున్నామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. భద్రత, నాణ్యత, నైతిక విలువల్ని ఉపయోగించుకుని దేశీయంగా వ్యాక్సిన్ రూపొందించడం చాలా అవసరమని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. భారత్ బయోటెక్ సంస్థ ( Bharat biotech company ) అభివృద్ధి చేసిన కో వ్యాక్జిన్ వ్యాక్సిన్ ( covaxin vaccine) పై ..ఆ సంస్థ ఇచ్చిన సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే అనుమతులిచ్చామని చెప్పింది. ప్రజారోగ్య  ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ ట్రయల్స్ దశను వేగవంతం చేస్తున్నట్టు ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. Also read: WHO: కరోనా ఔషధ ప్రయోగాలు త్వరలోనే: ప్రపంచ ఆరోగ్య సంస్థ


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.