దేశంలో ఓ వైపు కరోనా కేసులు ( Corona Cases ) విజృంభిస్తున్నాయి. మరోవైపు అన్‌లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ 3లో మరికొన్ని సడలింపులు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వాటిని తెరిచేందుకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండియాలో కరోనా కేసులు 14 లక్షలకు చేరిపోయింది. మరోవైపు అన్‌లాక్ 2 ప్రక్రియలు ముగిశాయి. అన్‌లాక్ 3 ప్రక్రియలో గైడ్‌లైన్స్ ( Unlock 3 Guidelines ) ఎలా ఉండబోతున్నాయన్నదే ఆసక్తి రేపుతోంది. దశల వారీగా ఒక్కొక్కటీ తిరిగి తెర్చుకుంటున్నాయి. అయితే అన్‌లాక్ 3 మార్గదర్శకాల్ని విడుదల చేసినా సరే...అందులో పాఠశాలలు, కాలేజీలు, మెట్రో సర్వీసులు మాత్రం ఉండకపోవచ్చని దాదాపు ఖరారైంది. ఎందుకంటే తల్లిదండ్రుల్నించి సేకరించిన అభిప్రాయ సేకరణలో అధికశాతం మంది పాఠశాలల్ని తెరవడానికి సానుకూలంగా లేనట్టే తెలిసింది.  మరి అటువంటప్పుడు అన్‌లాక్ 3లో ఇంకేం ఉండబోతున్నాయన్నదానిపై అందరి దృష్టీ నెలకొంది. ముఖ్యంగా సినిమా హాళ్లు, జిమ్స్ ను (Theatres and Gyms ) తెరిచేందుకు అన్‌లాక్ 3లో అనుమతి లభించవచ్చని తెలుస్తోంది. నిర్ధిష్టమైన మార్గదర్శకాలతో వాటిని తెరిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే సినిమా హాళ్లను తెరిచే ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖ..కేంద్ర హోంశాఖ ( Central Home minstry ) ముందుంచింది. Also read:Madras IIT: ఆ బ్యాండ్ ధరిస్తే చాలు..కరోనా ఉందో లేదో తెలుస్తుంది


హోం శాఖ ముందు ఈ ప్రతిపాదనను ఉంచేముందు థియేటర్ యాజమాన్యాలతో సమచార మంత్రిత్వ శాఖ సంప్రదించింది. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో అనుమతించాలని యాజమాన్యాలు కోరాయి. అయితే కోవిడ్ 19 నిబంధనలు ( Covid 19 Rules ) పాటిస్తూ..ముందు 25 శాతం సామర్ధ్యంతో తెరవాలని సమాచార మంతిత్వ శాఖ సూచించింది. ఇప్పుడు ఇందులో భాగంగానే కోవిడ్ 19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. Also read: Unlock 3.0: 27న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ