World Environment Day 2024: ప్రపంచపర్యావరణం దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు సినీ సెలబ్రిటీలు ఈ సందర్భంగా వాళ్లు #Vantarian అనే హ్యాష్‌ ట్యాగ్‌పై ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామంది  #iamvantarian అనే హ్యాష్‌ ట్యాగ్‌పై పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియా వేదికగా తమ వంతు కృషి చేశారు.  క్రికెటర్‌ కేఎల్ రాహుల్, హిరోయిన్ జాన్తీకపూర్‌, అజయ్‌ దేవగన్, భూమి పెడ్నేకర్‌ వంటి ప్రముఖులు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వాంటరియన్ ఉద్యమం ప్రధానంగా పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఓ నమ్మకంతో నడిచే వాంటరియన్ ఉద్యమం. ముఖ్యంగా ప్రకృతిని కాపాడటానికి ఓ నిబద్ధతతో మీ అలవాట్లను ప్రారంభించాలని ఈ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇలా ఒక్కొక్కరూ కలిసి కట్టుగా పోరాడితే ఈ పర్యావరణ సంరక్షణకు అధిక ప్రభావం చూపించవచ్చన్నారు.


ఇదీ చదవండి: కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాక్‌.. ఇక వారి ఆశలు గల్లంతే


అందుకే ఈ రోజే ఈ ప్రతిజ్ఞ తీసుకుంటే ఈ ప్రపంచాన్ని జయించగలం రక్షించగలం, మనమంతా కలిసి సమూల మార్పును ఈ ఉద్యమం ద్వారా నిర్మిద్దామన్నారు. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు చేసే ఈ చిన్న చర్యలతో మన భూమి పచ్చని భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందరికీ స్థిరమైన భవిష్యత్తు అందించడానికి మీరు కూడా మాతో చేరండి అని సోషల్ మీడియా వేధికగా ప్రత్యేక హ్యాష్‌ట్యాగులతో పంచుకున్నారు.


ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం.. ఈసారి గెలిచింది ఎంత మంది అంటే?


అజయ్‌ దేవగన్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాపై పర్యావరణంపై అవగాహన కల్పిస్తూనే ఉంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేను చిన్నదో పెద్దదో తన అలవాట్లను మార్చుకుంటానని కేఎల్‌ రాహుల్‌ కూడా చెప్పారు. #ImAVantarian #Vantara #WorldEnvironmentDay హ్యాష్‌ ట్యాగులపై ఇలా స్పందించారు.


 





 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి