Women MPs: లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం.. ఈసారి గెలిచింది ఎంత మంది అంటే?

Lok Sabha Elections 2024 Shocked To Women Lok Sabha Women Members Decrease: సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. గతం కంటే తక్కువ స్థాయిలో మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చట్టసభకు మహిళా ప్రాధాన్యం తగ్గింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 5, 2024, 10:22 PM IST
Women MPs: లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం.. ఈసారి గెలిచింది ఎంత మంది అంటే?

Lok Sabha Women MPs: ఆకాశంలో సగం.. జనాభాలో సగం అని మహిళలను చెబుతారు. కానీ రాజకీయ అవకాశాల్లో మాత్రం సగం లభించడం లేదు. మహిళా రిజర్వేషన్‌ను చట్టంగా తీసుకొచ్చినా ఆ చట్టం ఇప్పుడే అమల్లోకి రావడం లేదు. దీంతో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు అతి తక్కువగా అవకాశాలు ఇవ్వగా.. అవకాశాలు పొందిన మహిళలను ఓటర్లు ఆదరించలేదు. దీంతో తాజాగా పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5 మంది తక్కువగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Also Read: Chandrababu With NDA: కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు భారీ షాక్‌.. ఇక వారి ఆశలు గల్లంతే

 

దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్‌ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు, కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి ఎన్డీయే కూటమి రాబోతున్నది. అవన్నీ సరే కానీ వెలువడిన ఫలితాల్లో మహిళలు అతి తక్కువగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అన్ని పార్టీల నుంచి చాలా తక్కువ స్థాయిలో మహిళలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 18వ లోక్‌సభకు 73 మంది మహిళలు ఎన్నికవడం ఆందోళన కలిగించే విషయం. మొత్తం ఎంపీల్లో 13.44 శాతం మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే 5 మంది తక్కువగా ఎన్నికయ్యారు. అప్పుడు 78 మంది మహిళలు లోక్‌సభకు వచ్చారు. 14 శాతం ఉన్న మహిళా ఎంపీలు 13.44 శాతానికి తగ్గారు.

Also Read: Odisha Assembly Results: ఒడిశాలో 24 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ కోట బద్దలు.. బీజేపీ సంచలన విజయం

 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ తరఫున అత్యధికంగా 69 మంది పోటీలో నిలబడగా.. వారిలో సగానికి కన్నా తక్కువగా 30 మంది ఎంపీగా గెలిచారు. ఇక కాంగ్రెస్‌ తరఫున 41 మంది ఎన్నికల బరిలో నిలవగా కేవలం 14 మంది మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురు, డీఎంకే నుంచి ముగ్గురు, జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్‌) నుంచి ఇద్దరు చొప్పున మహిళలు లోక్‌సభకు వచ్చారు.

నారీశక్తి వందన్‌ చట్టం ఆలస్యం
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ గతేడాది భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నారీ శక్తి వందన్‌ అధిన్యాయం పేరిట చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి కూడా ఆమోదించారు. కానీ ఆ చట్టం అమలు రూపంలోకి రాలేదు. భారత ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలవుతుందని ఓ మెలిక పెట్టింది. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News