Health Tips: స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలిపితే సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు..
Bath Health Tips: కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో సీజనల్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఈ సీజనల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
Bath Health Tips: ఈ సీజన్లో సీజనల్ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. జలుబు జ్వరంతో బాధపడుతున్నారు అదే కాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో సీజనల్ నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఈ సీజనల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
వేప..
స్నానం చేసే నీటిలో వేప చేసుకొని స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేపల్లో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ భారి నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా వేపతో చేసిన నీటితో స్నానం చేయటం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు రాషెస్ దురద వంటి సమస్యలకు దూరంగా ఉంటారు మనం స్నానం చేసే నీటిలో బాగా ఉడికించి తయారు చేసుకోవాలి.
పసుపు..
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో అరే మూడు స్పూన్ల పసుపు వేసి స్నానం చేసుకోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు ముఖ్యంగా పసుపులో కరకు మీన్ ఉంటుంది డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి వరం.
వేడి నీరు..
అంతేకాదు ఈ సీజన్లో ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ ఆరోగ్యం కూడా బూస్ట్ అవుతుంది. బ్యాక్టిరియాను చంపి వేస్తుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వేడి నీటితో స్నానం చేయాలి కనీసం వారానికి ఒకసారి అయినా ఇలా చేయడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ఇదీ చదవండి: నోరూరించే మటన్ కట్లెట్ సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా..
మందార ఆకు..
మందారకు అందరు ఇళ్లలో ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా హెయిర్ సమస్యలను తొలగిస్తుంది. అయితే ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మందార కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార పౌడర్ కూడా మార్కెట్లో విపరీతంగా అందుబాటులో ఉన్న ఈ మందార ఆకులను మరిగించి స్నానం చేయడం వల్ల స్కిన్ల బారిన పడకుండా ఉంటారు.
ఇదీ చదవండి: ఈ 8 అందమైన ప్రదేశాలు గోవాలోనే ఉన్నాయంటే మీరు నమ్మరు.. ఇవి చాలామందికి తెలియదు..
తులసి ఆకులు..
తులసి ప్రతి ఇళ్లలో ఉంటుంది ఈ తులసి ఆకులను కూడా వేడి నీటిలో వేసి మరిగించ స్నానం చేయడం వల్ల ఎంతో మంచిది ఇది ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. తులసి స్నానం చేస్తే సీజనల్ వ్యాధులను బారిన పడకుండా ఉంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook