Travel Tips: ఈ 8 అందమైన ప్రదేశాలు గోవాలోనే ఉన్నాయంటే మీరు నమ్మరు.. ఇవి చాలామందికి తెలియదు..

8 Secret Towns Near Goa: గోవా చాలామందికి ఓ మంచి డెస్టినేషన్‌. ఇక్కడికి వెళ్లాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటారు. ఇక్కడి బీచ్‌లు, ఫుడ్‌ పెట్టింది పేరు. ఏ మాత్రం సెలవులు వచ్చినా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో మొదటగా గోవాలో సేదతీరడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, చాలా మందికి గోవా అంటే బాగా బీచ్‌, కాలింగట్‌ వంటివి మాత్రమే తెలుసు. కానీ, గోవాలో చాలా మందికి తెలియని 8 అందమైన ప్రదేశాలు ఉన్నాయి.. 
 

1 /8

చోర్లా ఘాట్‌.. ఇది వెస్ట్రన్‌ ఘాట్‌లో ఉన్ఆనయి. గోవా కర్నాటక బార్డర్‌లో ఈ అందమైన ప్రదేశం ఉంది. చోర్లా ఘాట్‌ ఓ మంచి హీల్‌ స్టేషన్‌. ఇక్కడి ప్రకృతి పచ్చదనం, వాటర్‌ఫాల్స్‌, ట్రెక్కింగ్‌ ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తుంది.

2 /8

తంబ్డి సర్లా.. ఇది గోవాలోని భగవాణ్‌ వైల్డ్‌లైఫ్ సాంక్యువరీకి దగ్గరల్లో ఉంటుంది. 12 సెంచరీకి చెందిన శివుడి ఆలయం వద్ద తంబ్డి సర్లా ఉంటుంది. చుట్టుముట్టూ అడవి ఉంటుంది. 

3 /8

నెర్సా.. ఇది గోవా కర్నాటక బార్డర్‌లోని చిన్న గ్రామం. పక్షి ప్రేమికులకు ఇది పర్ఫెక్ట్‌ ప్రదేశం. అంతేకాదు ఇక్కడ చుట్టూ అడవి, పచ్చదనానికి పుట్టినిల్లుగా కనిపిస్తుంది.

4 /8

సడా ఫోర్ట్‌.. ఇది కూడా గోవా కర్నాటక బార్డర్‌లో ఉంటుంది. ఇది చారిత్రాత్మకమైన ప్రదేశం. చుట్టుముట్టూ ప్రకృత సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రదేశం కూడా ట్రెక్కింగ్‌కు పెట్టింది పేరు.

5 /8

దండేలీ.. దండేలీ అతి తక్కువ మందికి పరిచయం ఉన్న ప్రదేశం. ఇది కూడా వైల్డ్‌లైఫ్ సాంక్చువరీకి పెట్టింది పేరు. ఇక్కడ వైట్‌ వాటర్‌ రాఫ్టింగ్‌, సహజసిద్ధమైన ప్రకృతి సుందర దృశ్యాలు టూరిస్టులను కనువిందు చేస్తాయి.

6 /8

కర్వార్‌.. సౌత్‌ గోవా ఉన్న ఈ కర్వార్‌ ప్రిస్టీన్‌ బీచ్‌తో పాటు ిఇది కూడా చారిత్రాత్మకమైన ప్రాంతం. ఇక్కడి చల్లని వాతావరణం బాగుంటుంది. ముఖ్యంగా ఇది రవింద్రనాథ్‌ ఠాగూర్‌ బీచ్‌, సీఫుడ్‌కు పెట్టింది పేరు.

7 /8

గోకర్ణ.. గోకర్ణ ఎంతో ప్రసిద్ధమైన ప్రదేశం. ఇక్కడి బీచ్‌ కూడా అందంగా ఉంటుంది. గోవాకు వెళ్లిన వారు గోకర్ణకు తప్పకుండా వెళ్లాల్సిందే.

8 /8

సవాంత్వాడి.. మహారాష్ట్ర గోవా బార్డర్‌లో సవాంత్వాడి ఉంటుంది. ఇది కూడా నాగరికత, చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడి చెక్క బొమ్మలు, ప్యాలస్‌, ప్రకృతి సుందర దృశ్యాలు ప్రతిఒక్కరినీ కనువిందు చేస్తాయి.