Control Diabetes in 3 Minutes with Jamun Seeds: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు చాలా మంది విచ్చల విడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అన్ని విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన పలు ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది:


నేరేడు పండు విత్తనాలు:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ నేరేడు పండు విత్తనాలు పొడి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం గింజలను ఎండలో ఆరబెట్టి, ఆపై వాటిని మెత్తగా పొడి చేయండి. తేలికపాటి గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.


దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క తినడం వల్ల కూడా సులభంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.. కాబట్టి దీనిని పొడి చేసి గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు.


మెంతికూర:
మెంతికూర, గింజలు కూడా మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చక్కెర నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా సలుభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అంజీర్‌ పండు ఆకులు:
అంజీర్‌ పండు ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ పచ్చి ఆకులను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


వెల్లుల్లి:
వెల్లుల్లి ఆహార రుచిని పెంచడమేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వెల్లుల్లి మొగ్గలను నమిలి పచ్చిగా తింటే కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా తగ్గుతాయి.


Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే


Aslo Read: Upasana necklace Cost : ఆస్కార్ వేడుకలు.. ఉపాసన ధరించిన నెక్లెస్‌పై ఫోకస్.. దాని ధర ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి