Upasana Konidela At Oscar 2023: ఆస్కార్ వేడుకల్లో ఉపాసన ధరించిన నెక్లెస్‌పై ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్.. ధర ఎంతంటే..?

Upasana Necklace @ Oscar 2023: ఉపాసన, రామ్ చరణ్‌ ఇద్దరూ కూడా ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఉపాసన స్పెషల్ డిజైన్ దుస్తులను ధరించడమే కాకుండా స్పెషల్ నెక్లెస్‌ను వేసుకుంది. దీనిపై అక్కడి మీడియా ఫోకస్ పెట్టేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 05:45 PM IST
  • అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు
  • ఆస్కార్ కొట్టేసిన నాటు నాటు పాట
  • వేడుకల్లో మెరిసిన ఉపాసన కొణిదెల
Upasana Konidela At Oscar 2023: ఆస్కార్ వేడుకల్లో ఉపాసన ధరించిన నెక్లెస్‌పై ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్.. ధర ఎంతంటే..?

Upasana Necklace @ Oscars 2023: రామ్ చరణ్‌, ఉపాసన ఇద్దర కూడా ఆస్కార్ వేడుకల్లో కనువిందు చేశారు. ఇక ఉపాసన ధరించిన స్పెషల్ నెక్లెస్ మీద అక్కడి మీడియా బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఆ రిపోర్టర్ అయితే.. ఉపాసన ధరించిన నెక్లెస్ ధర కూడా చెప్పేశాడు. రామ్ చరణ్ అయితే తన భార్యను, తన భార్య ధరించిన నెక్లెస్‌ను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఎంతో నర్వెస్‌గా ఫీల్ అవుతున్నాడట. ఈ క్రమంలో చెర్రీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్‌లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. తన భార్యకు ఆరో నెల అని చెప్పడం, తన బిడ్డ త్వరలోనే రాబోతోందంటూ చెప్పడం, ఉపాసన మెడలో ధరించిన నెక్లెస్ గురించి మీడియా అడగడం, దాని గురించి రామ్ చరణ్‌ కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆస్కార్ వేడుకలు ఎలా అనిపిస్తున్నాయి.. నర్వెస్‌గా ఫీల్ అవుతున్నారా..? అని మీడియా అడిగితే.. రామ్ చరణ్ అలాంటిదేమీ లేదని అన్నాడు. ఉపాసన మాత్రం కాస్త నర్వెస్‌గానే ఫీల్ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక అదే క్రమంలో ఉపాసన ధరించిన నెక్లెస్ గురించి మాట్లాడాడు సదరు రిపోర్టర్. నాలుగు వందల రూబీస్‌ విలువ కలిగిన నెక్లెస్ ధరించారు అంటూ ఉసాసన గురించి అన్నాడు.

ఆ సమయంలో రామ్ చరణ్‌ ఇలా ఫన్నీగా సెటైర్ వేశాడు. ఇప్పుడు నాకు నర్వెస్‌గా అనిపిస్తుంది.. నా భార్యను చూసుకోవాలి.. తను వేసుకున్న ఆ నెక్లెస్‌ను చూసుకుకోవాలి.. రెండు రకాలుగా నర్వెస్‌ ఫీల్ అవుతున్నాను అంటూ రామ్ చరణ్‌ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. మొత్తానికి నాటు నాటు పాటకు మాత్రం రామ్ చరణ్‌, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులే ఆస్కార్ వరకు తీసుకొచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్‌లో కొత్త హిస్టరీని క్రియేట్ చేసినట్టుగా అయింది.

Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు

Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News