Kidney Stones: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ప్రతిరోజు తీసుకోవాల్సిందే..!
Kidney Stones Health Foods: కిడ్నీలు శరీరానికి ఎంతో అవసరమైన అవయవాలు. వీటిని జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం, కానీ కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కలుగుతాయి. అయితే ఈ ఆహారం పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
Kidney Stones Health Foods: కిడ్నీలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వర్తిస్తాయి. కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యల బారిన పడడానికి ఎన్నో కరణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎంటో మనం తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలకు కరణాలు:
మధుమేహం కిడ్నీలకు తీవ్రమైన నష్టం కలిగించే ప్రధాన కారణాలలో ఒకటి. అలాగే అధిక రక్తపోటు కూడా కిడ్నీలలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాలను శుభ్రంగా ఉంచకోకుండా ఉండటం వల్ల బ్యాక్టీరియా కిడ్నీలకు చేరితే తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా గ్లోమరులోనెఫ్రిటిస్ వంటి అంటువ్యాధులు కిడ్నీలను దెబ్బతీస్తాయి. కొన్ని రకాల ఔషధాలు కిడ్నీలకు హాని కలిగించవచ్చు
కిడ్నీ సమస్యల లక్షణాలు:
కిడ్నీ సమస్యలు చాలా సాధారణంగా ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
మూత్రంలో మార్పులు:
మూత్రం పరిమాణంలో పెరుగుదల లేదా తగ్గుదల, రంగు మారడం (చెక్క లేదా కోలా రంగు) రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం కోసం లేవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శరీరంలో వాపు:
ముఖం, చేతులు, కాళ్ళు, చీలమండలు వాపు, శరీరంలో ఎక్కడైనా వాపు వటివి కనిపిస్తాయి. ఇది శరీరానికి కనిపించినప్పుడు చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
అలసట:
ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా అనిపించడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కిడ్నీ సమస్య సూచన.
కిడ్నీ సమస్య తీసుకోవాల్సిన పదార్థాలు:
కిడ్నీ సమస్య ఉన్న వారికి ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని పదార్థాలు కిడ్నీలపై భారం తగ్గిస్తాయి, మరికొన్ని పదార్థాలు కిడ్నీలకు హాని కలిగిస్తాయి. అందుకే ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది బాగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో యాపిల్, బెర్రీలు, ద్రాక, ఆరెంజ్, అరటి పండు వంటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు ధాన్యాలు అయిన బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ తీసుకోవడం మంచిది. అలాగే చేపలు, చికెన్, టర్కీ, గుడ్లు, పాలు, పనీర్ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో కూడా కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి.
వీటిని ఎందుకు తీసుకోవాలి:
కిడ్నీ సమస్య ఉన్నవారికి పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉండటం ప్రమాదకరం. ఈ పదార్థాల్లో పొటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ మలబద్ధకం తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
ఎంత తీసుకోవాలి:
ఒక డాక్టర్ లేదా డైటీషియన్‌తో మాట్లాడి, సరిపోయే ఆహార పథకాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్య తీవ్రత, ఇతర ఆరోగ్య పరిస్థితులు, మందులు వంటి అనేక అంశాల ఆధారంగా మీరు తినే ఆహారం మారుతుంది.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆహార పథకాన్ని ప్రారంభించే ముందు మీ డాక్టర్ లేదా డైటీషియన్‌తో మాట్లాడండి.
Also Read: Gua Sha Benefits: Gua Sha ధెరపి వల్ల ఎన్నో ఉపయోగాలో తెలుసా? ఎలా ఉపయోగించాలి అంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter