Gua sha benefits for skin: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. దీని కోసం లేడీస్ బ్యూటీ పార్లర్‌లో ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అంతేకాకుండా ఖరీదైనా ప్రొడెక్ట్స్‌లను వాడుతుంటారు. కానీ ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. అయితే సహాజంగా మొఖం మెరిసిపోవాలంటే కొన్ని పద్థతులు ఉపయోగపడుతాయి. అందులో గువాషా ఒకటి.
గువాషా అంటే ఏమిటి?
గువాషా అనేది ఒక ప్రాచీన చైనీస్ చికిత్స పద్ధతి. ఇది శరీరంలోని కొన్ని చోట్ల మసాజ్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల శరీరానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, విషాన్ని తొలగిస్తుంది, శరీరం సహజ స్వస్థతను పెంచుతుంది అని నమ్ముతారు.
ఇది ఎలా తయారు చేస్తారు?
గువాషాలో సాధారంగా జేడ్ స్టోన్ వంటి మృదువైన, సహజమైన రాళ్లను ఉపయోగిస్తారు. ఈ రాళ్లతో ముఖంపై మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, విషతుల్య పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మెరుపును పెంచుతుంది. ఇది కేవలం ముఖం కోసం మాత్రమే కాకుండా, శరీరం మొత్తానికి ఉపయోగపడుతుంది. దీంతో ఒత్తిడిని తగ్గించడం, నిద్రను మెరుగుపరచడం, శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
గువా షా చేయించుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు:
చర్మ రకం: చర్మ రకానికి తగిన స్టోన్, మర్దన విధానాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
వైద్యుల సలహా: ఏదైనా కొత్త ఆరోగ్య చికిత్సను ప్రారంభించే ముందు వైద్యునితో సంప్రదించడం మంచిది.
అనుభవం ఉన్న వ్యక్తి: గువా షాను అనుభవం ఉన్న వ్యక్తి చేయించుకోవడం మంచిది.
గువాషా చేసే పద్ధతి:
తైలం లేదా క్రీమ్: గువాషా రాయిని చర్మంపై మృదువుగా జారేలా చేయడానికి ఒలివ్ ఆయిల్ లేదా గువాషా క్రీమ్ వంటి నూనెను లేదా క్రీమ్‌ను ఉపయోగించాలి.
రాయిని ఎంచుకోవడం: గువాషా కోసం వివిధ రకాల రాళ్ళు ఉపయోగిస్తారు. జేడ్, రోజ్ క్వార్ట్జ్, లేదా నెఫ్రైట్ వంటి రాళ్ళు సాధారణంగా ఉపయోగిస్తారు.
చర్మాన్ని సిద్ధం చేయడం: గువాషా చేయబోయే ప్రాంతాన్ని శుభ్రం చేసి, తేమ చేయాలి.
చెర్రీ రెడ్ మార్క్స్: గువాషా చేసిన తర్వాత చర్మంపై చెర్రీ రెడ్ మార్క్స్ కనిపించడం సాధారణం. ఇది శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తున్న సంకేతం.
హైడ్రేషన్: గువాషా తర్వాత చర్మాన్ని బాగా హైడ్రేట్ చేయాలి.
Also Read: Tofu Uses: టోఫు అంటే ఏమిటి? తయారీ విధానం తెలుసుకుందాం !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter