Ringworm Remedies: ఎండకాలం పోయి, వర్షాకాలం రానే వచ్చింది. వాన కాలంలో శరీరం ఎంత హాయిగా ఉంటుందో.. చర్మానికి, శరీరానికి అన్నే నష్టాలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సిజన్‌లో చర్మ సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి.  గజ్జి, తామర వంటి వ్యాధులు అధికం కావడం విశేషం. అయితే చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే ఈ వస్తువులను ఉపయోగించి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఆ వస్తువులేంటో..ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని ఉపయోగించి తామర నుంచి విముక్తి పొందండి:


1. వేప నూనెను ఉపయోగించి వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
వేప నూనెలో ఆయుర్వేదనికి సంబంధించి అనేక రకాల గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది.


2. చర్మంపై తామర ఉన్న ప్రాంతంపై టమాటోతో తయారు చేసిన ప్యూరీని అప్లై చేయండి.  దురద, రింగ్‌వార్మ్ నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


3. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పసుపును కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం చెంచా పసుపు తీసుకుని అందులో నీళ్లు వేసుకుని మిక్స్‌ చేసి దానిని ప్రభావిత ప్రాంతంపై మర్దన చేయాలి.


4. కలబందలో సహాయంతో కూడా చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీని పేస్ట్‌ను రింగ్‌వార్మ్ పూయాలి. ఇలా చేయడం ద్వారా త్వరగానే విముక్తి లభిస్తుంది.


5. కొబ్బరి నూనె ద్వారా కూడా ఈ తామర నుంచి ఉపశమనం లభిస్తుంది. నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే తొందరగానే సమస్య దూరమవుతుంది.


6. రింగ్‌వార్మ్, దురద సమస్యలు తగ్గడానికి నిమ్మకాయను రసాన్ని వినియోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. దీని ద్వారా త్వరగానే ఉపశమనం లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.


7.  ప్రస్తుతం చాలా మంది హెర్పెస్-స్కేబీస్ దురదతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న ప్రదేశంలో వెల్లుల్లి పేస్ట్‌ను పూయడం వల్ల దీని నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.


Aslo Read: Telangana Weather: వాతావరణ శాఖ హెచ్చరిక... తెలంగాణలో 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు


Also Read: White Hair Problem: తరచుగా జుట్టు తెల్లబడుతుందా..ఈ చిట్కాలు పాటించండి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.