Telangana Weather: వాతావరణ శాఖ హెచ్చరిక... తెలంగాణలో 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Telangana Weather Updates: తెలంగాణలో బుధ, గురు, శుక్రవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 02:48 PM IST
  • వాతావరణ శాఖ అలర్ట్
  • తెలంగాణలో 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • పలు జిల్లాల్లో వడగాల్పులులు వీచే అవకాశం
Telangana Weather: వాతావరణ శాఖ హెచ్చరిక... తెలంగాణలో 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Telangana Weather Updates: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి (జూన్ 8) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధ, గురువారాల్లో (జూన్ 8, 9) ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో.. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శని, ఆదివారాల్లో (జూన్ 11, 12)తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ధ్రోణి ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంద్ర తీరం వరకు వ్యాపించి ఉంది. సముద్రం మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ధ్రోణి ఆవరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 

ఇవాళ ఉదయం 8.30 గం. సమయంలో నల్గొండలో అత్యల్పంగా 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్నిచోట్ల మబ్బు పట్టినట్లు ఉన్నప్పటికీ ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Fact Check: ప్రభుత్వ యోజనా పథకం పేరుతో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే బీ అలర్ట్..  

Also Read: CM Jagan on 2024 Elections: మళ్లీ మన ప్రభుత్వే రాబోయేది..నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News