పిల్లలు స్మార్ట్ ఫోన్ ( Smartphone ) వినియోగించడం ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. పిల్లలు అల్లరి చేస్తోంటే వారిని ఒక్క చోట కూర్చోబెట్టేందుకు వారికి వీడియోస్ లేదా గేమ్స్ (Gaming Apps) పెట్టి ఇస్తున్నారు పెద్దలు. దీని వల్ల పెద్దలు ఫోకస్ గా తమ పని చేసుకోగలిగినా.. పిల్లలపై అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయి. పైగా చాలా మంది పేరెంట్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్స్ కొని ఇస్తున్నారు. దాంతో వారి బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలపై దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 




ఈ చిట్కాలు పాటించడండి ( Tips to Make Kids Stay Away from Smartphone )


- పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడానికి బదులు వారితో చిన్న చిన్న గేమ్స్ అడేందుకు ప్రయత్నించాలి.


- పిల్లలతో మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి.


- పిల్లల (Children) ఎదుగుదలకు ఉపయోగపడే పజిల్స్, బిల్డింగ్ బ్లాక్స్ వంటి గేమ్స్ అందుబాటులో ఉంచండి.


- తరచూ బయటికి తీసుకెళ్లండి.



- అక్షర మాల, ఆల్ఫాబెట్స్ కు సంబంధించిన గేమ్స్ వచ్చాయి. వాటితో ఆడేలా ప్రోత్సాహించండి.


- వారికి మంచి కథలు చెప్పండి. వారు తమ మనసులో ఏం అనుకుంటున్నారో అడిగి వాటిని చెప్పేలా ప్రోత్సాహించండి.


 A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Iphone Link - https://apple.co/3loQYeR