Sleeping Tips: ఆందోళన లేకుండా నిద్రపోవడానికి పాటించాల్సిన చిట్కాలు
నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది వరంలాంటిదే.
నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది వరంలాంటిదే. ఎన్నో టెన్షన్స్, నిత్యం బిజీబీజీ లైఫ్ స్టైల్ ( Life Style ) వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు చాలా మంది. దీని ప్రభావం వారి ఆరోగ్యంపైన ( Health ) పడుతుంది. నిద్ర కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఎకాగ్రత లోపిస్తుంది.
ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.
- నిద్ర ఆనేది శారీరక అవసరం అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది.
-
Golden Turtle: నేపాల్ లో బంగారు వర్ణం తాబేలు... విష్ణుమూర్తి అవతారం అంటున్న ప్రజలు
-
Covid-19 Ointment: వచ్చేసింది కరోనాను అంతం చేసే ఆయింట్ మెంట్
-
- టెన్షన్ తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
- నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేనిపోని టెన్షన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడం దిగులు తగ్గుతుంది.
- చాలా మంది ప్లానింగ్ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్ పెరిగి అది నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.