నేటి బిజీ జీవితానికి సరిపడే సాంకేతికత జీవితాన్ని కాస్త సులభతరం చేస్తోంది. కనీసం అన్నం ( Rice Cooking ) వండుకోవడానికి కూడా సమయం లేదు అని చాలా మంది వాపోతుంటారు. అలాంటి వారి కోసం మంచి అప్షన్ గా మారింది ఎలక్ట్రిక్ కుక్కర్ ( Electric Rice Cooker ) . బియ్యం కడిగేసి నీరుపోసి స్విచ్ ఆన్ చేస్తే చాలు అన్నం ఉడికిన తరువాత దానికదే ఆగిపోతుంది.
ప్రెషర్ కుక్కర్ లా మూడో విజిల్ వచ్చిందా.. లేదా ఇది నాలుగో విజిలా.. అయ్యో అన్నం మాడిపోయిందేమో అని విజిల్స్ లెక్కపెట్టే అవసరం లేదు. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ కుక్కర్ దాని పని అది చేస్తుంది. అయితే ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్ కొనే సమయంలో ఈ చిట్కాలు పాటించండి. మీ లైఫ్ స్టైల్ ( LifeStyle ) ను సులభతరం చేసుకోండి.
కుటుంబాన్ని బట్టి...
మీ కుటుంబ అవసరాలను అంచనా వేసి మార్కెట్ లో ఎలక్ట్రిక్ కుక్కర్ కొనడానికి వెళ్లండి. 5-6 మంది ఉన్న కుటుంబానికి 3 నుంచి 5 లీటర్ల కుక్కర్ సరిపోతుంది.
ఏది బెస్ట్...
ఎలక్ట్రిక్ కుక్కర్ లో రెండు వెరియంట్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి థెర్మల్, రెండోది ఇండక్షన్ కుక్కర్. ఇందులో ఇండక్షన్ మెషిన్ ఉన్న కుక్కుర్ బెస్ట్.
పవర్ కార్డు
ఇక కన్వీనియంట్ గా వినియోగించాలి అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డిటాచబుల్ అంటే సులభంగా తీసిపెట్టే అవకాశం ఉన్న పవర్ కార్డు లేదా వైర్ ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్ ను ఎంచుకోండి.
వారంటీ
ఎలక్ట్రిక్ కుక్కర్ కొనడానికి ముందు దానికి ఉన్న వారంటీ ఏంటో తెలుసుకోండి. ఎంత ఎక్కవ వారంటీ ఉంటే అంత మంచిది.
ఇవి కూడా చదవండి
-
Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
-
Eye Protection: స్మార్ట్ ఫోన్ వెలుగు నుంచి కంటిని కాపాడుకుందాం
-
Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.
-
Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
-
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం