Golden Turtle: నేపాల్ లో బంగారు తాబేలు... విష్ణుమూర్తి మళ్లీ అవతరించాడా?

నేపాల్ ( Nepal ) లో ఒక తాబేలు బంగారు వర్ణంతో జన్మించింది. అది విష్ణమూర్తి ( Sri MahaVishnu ) మరో అవతారం అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు మాత్రం వేరే థియరీ చెబుతున్నారు. 

Last Updated : Aug 22, 2020, 03:37 PM IST
    • నేపాల్లో ఒక తాబేలు బంగారు వర్ణంతో జన్మించింది. అది విష్ణమూర్తి మరో అవతారం అని ప్రజలు నమ్ముతున్నారు.
    • అయితే దీనిపై శాస్త్రవేత్తలు మాత్రం వేరే థియరీ చెబుతున్నారు.
    • అతీతమైన శక్తులు దీనికి ఉన్నాయని వారు విశ్వసిస్తున్నారు.
Golden Turtle: నేపాల్ లో బంగారు తాబేలు... విష్ణుమూర్తి మళ్లీ అవతరించాడా?

నేపాల్ ( Nepal ) లో ఒక తాబేలు బంగారు వర్ణంతో జన్మించింది. అది విష్ణమూర్తి (  Sri MahaVishnu ) మరో అవతారం అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు మాత్రం వేరే థియరీ చెబుతున్నారు. ఈ ప్రత్యేక వర్ణంలో తాబేలు జన్మించడానికి కారణం అత్యంత అరుదైన జణ్యు పరిణామమే అని చెబుతున్నారు. దీనిని వారు క్రోమాటిక్ ల్యూసిజం ( Chromatic Leucism ) కారణం అని చెబుతున్నారు. విష్ణు భగవానుడు మళ్లీ అవతారం ఎత్తినట్టు నేపాలీ ప్రజలు ఈ తాబేలును కొలుస్తున్నారు. అతీతమైన శక్తులు దీనికి ఉన్నాయని వారు విశ్వసిస్తున్నారు. 

నేపాల్ లోని ధనుషా జిల్లాలోని ధనుషాదం మున్సిపాలిటీలో ఈ తాబేలు ( Turtle ) జన్మించింది. మిథిలా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ( Mithila Wild Life Trust ) దీనిని ఇండియన్ ఫ్లాప్ షెల్ గా గుర్తించింది. జంతునిపుణులు కూడా ఈ తాబేలుకు అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు.

ఈ బంగారు తాబేలు మాత్రమే కాదు.. నేపాల్ లో బంగారు ( Gold ) వర్ణం ఉన్న ప్రతీ ప్రాణికి ప్రత్యేకంగా కొలుస్తారు. శ్రీ మహావిష్ణు అవతరించినట్టు అనిపిస్తోంది. ఆకాశం, భూమి కలయికతో ఈ తాబేలు అవతారం ఆధ్యాత్మికంగా ప్రత్యేకత కలిగి ఉంది అని జంతునిపుణులు అయిన దేవ్ కోటా చెబుతున్నారు. ఈ తాబేలును ఎవరికీ తెలియకుండా సురక్షితమైన ప్రదేశంలో వదిలి వేశారని సమాచారం.4

మీకోసం..

Trending News