సీజన్ ఏదైనా సరే చర్మ పరిరక్షణ చాలా అవసరం. చర్మానికి తగిన కేర్ తీసుకోకపోతే వివిధ రకాల మచ్చలతో ఇబ్బందిగా మారుతుంది. అంద విహీనమై నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మ సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్స్ కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే ఉత్తమం. ఎందుకంటే సహజసిద్ధమైన పదార్ధాలతో దుష్పరిణామాలు కలుగవు. ముఖ్యంగా బంగాళదుంప, టొమాటో రసం ముఖంపై మచ్చల్ని దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. టొమాటో, బంగాళదుంప రసాన్ని రాయడం వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలు దూరమౌతాయి.


బంగాళదుంప రసాన్ని రాసేముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దూది సహాయంతో ముఖానికి బంగాళదుంప, టొమాటో రసాన్ని రాసి..ఓ అరగంట ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖానికి నిగారింపు వస్తుంది. బంగాళదుంప, టొమాటో రసం వల్ల బ్యాక్టీరియా, డెడ్ స్కిన్, వ్యర్ధాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖానికి బంగాళదుంప, టొమాటో రసంతో పాటు కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. ఈ రెండింటి మిశ్రమంలో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మచ్చలు, మరకలు పూర్తిగా తొలగిపోతాయి. కొలాజెన్ ప్రోటీన్లను పెంచుతుంది. బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. 


టొమాటో రసంతో పింపుల్స్ పూర్తిగా దూరమౌతాయి. బంగాళదుంప రసం, తేనెను ముఖానికి రాయడం వల్ల చాలా లాభం కలుగుతుంది. ఓ గిన్నెలో బంగాళదుంప రసం, తేనె కలిపి..నిమ్మకాయతో కలిపి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. కాస్సేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజ్ చేసేందుకు బంగాళదుంప, టొమాటో రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేసేందుకు టొమాటో, బంగాళదుంప రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. 


Also read: Cumin Seeds Benefits: జీలకర్ర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా...!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook