Cumin Seeds Benefits: జీలకర్ర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా...!

Cumin Seeds: జీలకర్ర తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 09:57 AM IST
Cumin Seeds Benefits: జీలకర్ర తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా...!

Cumin Seeds Health Benefits: మనం రోజూ వాడే వాటిల్లో జీలకర్ర ఒకటి. దీనిని ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తాం. ఈ జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మార్కెట్లో రెండు రకాలుగా లభిస్తుంది. మామూలు జీలకర్ర, రెండోది నల్ల జీలకర్ర. ఇది ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉంది. మధుమేహం నుండి బరువు తగ్గించడం వరకు అనేక సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్ర తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. 

జీలకర్ర ఉపయోగాలు
జ్ఞాపకశక్తి మెరుగు
జీలకర్రలో రిబోఫ్లావిన్, విటమిన్ బి6, జియాక్సంథిన్, నియాసిన్ వంటి ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి పరగడుపునే తినండి.
బరువును తగ్గిస్తుంది
ఊబకాయంతో బాధపడేవారు జీలకర్రను తినడం వల్ల బరువు తగ్గుతారు. . కాల్చిన జీలకర్రను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మరసం కలిపి త్రాగాలి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. 
చర్మ సమస్యలకు చెక్
చర్మ, మెుటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్రను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వేయించిన జీలకర్ర పొడిని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మీ ముఖానికి నిగారింపుతోపాటు మెుటిమలు వంటి సమస్యలు తొలగిపోతాయి. 

జీర్ణ సమస్యలు దూరం
చలికాలంలో మీరు జీర్ణ సమస్యలు ఇబ్బంది పడుతుంటే జీలకర్రను తీసుకోండి. జీలకర్రలో ఉండే థైమోల్ మరియు ముఖ్యమైన నూనెలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఆహారం వేగంగా జీర్ణవుతుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది. దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినండి. 
మధుమేహాం అదుపు
మధుమేహ రోగులకు జీలకర్ర చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఏడెనిమిది చెంచాల వేయించిన జీలకర్ర పొడిని రోజుకు రెండుసార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

Also Read: Coconut water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా... అయితే ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News