ఇంట్లో ఒక చిన్నారి కొత్త సభ్యుడు చేరినా.. తండ్రికి ఒకటి రెండు రోజులు మాత్రమే సెలవు దొరుకుతుంది. కానీ యూఏఈ ( UAE ) లో ఇక ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా పాటెర్నిటీ లీవ్స్ లో దొరకనున్నాయి. చిన్నారి జననం తరువాత ఆరు నెలల వరకు కూడా సెలవు దొరికే అవకాశం ఉంది.



యూఏఈ ప్రభుత్వం ఇటీవలే పాటెర్నిటీ లీవ్స్ ( Paternity Leaves ) ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పని చేసేవారికి ఈ సౌలభ్యం ( Private Sector Employees ) ఒక వరంలా మారనుంది. బేబీ పుట్టగానే ఐదు రోజుల పెయిడ్ లీవ్ ఇమ్మీడియెట్ గా దొరుతుకుంది.


షేఖ్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నాయన్ ఆదివారం రోజు దీనికి సంబంధించిన ఆర్డర్ జారీ చేశారు. మినిమం ఐదు రోజుల నుంచి మ్యాగ్జిమం 6 నెలల వరుకు లీవ్స్ తీసుకోవచ్చు. పాటెర్నిటీ లీవ్ ఇచ్చిన తొలి అరబ్ దేశంగా యూఏఈ అవతరించింది.



దేశంలో లింగ వివక్షను నిర్మూలించడానికి, సమానత్వాన్నిచాటి ( Gender Equality ) చెప్పడానికి దేశంలో అందరూ సంతోషంగా ఉంటానికి, కుటుంబాలు ఆనందంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ రంగంలో యువతను ఆకర్శించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.