AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..

Fri, 18 Dec 2020-5:23 pm,

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ (Andhra Pradesh Cabinet Meeting) జరిగింది. ఇళ్లపట్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు, రైతు భరోసా, ఏపీ టూరిజం పాలసీ వంటి అంశాలపై సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. (Photos: Twitter)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

ఏ సీజన్‌లో పరిహారం ఏపీ రైతులకు ఆ సీజన్‌లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆమోదించారు.

Gallery: Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపెట్టిన రూ.1200 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి చెల్లించాలని వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నివర్‌ తుఫాన్ బాధితులకు డిసెంబర్ నెలాఖరులోగా పరిహారం చెల్లించడానికి గ్రీన్ సిగ్నల్.

Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?

ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేయడానికి నిర్ణయం.‌ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు కేటాయింపులు సహా మరిన్ని కీలక నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది.

ఏపీ‌ పర్యాటక పాలసీకి ఆమోదం లభించింది. తద్వారా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానానికి మంత్రి వర్గం ఓకే చెప్పింది.

కరోనా వైరస్ దెబ్బకు నష్టపోయిన హోటల్‌ రంగం రీస్టార్ట్‌ కోసం రూ.15 లక్షల వరకు రుణం అందించాలని నిర్ణయించారు. దాదాపు 200 కోట్ల రూపాయల మేర పర్యాటక ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 

Also Read: Worlds Shortest Woman Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link