Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, పసిడి దారిలోనే వెండి ధరలు
Gold Rate Update 2 March 2021: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరుగుతున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే
Gold Price Today In Hyderabad 2 March 2021: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ పెరిగింది. తాజాగా రూ.400 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.360 తగ్గడంతో బంగారం ధర రూ.43,050 అయింది.
Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.380 మేర బంగారం ధర పుంజుకోవడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,300 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200కి చేరింది.
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.700 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.68,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.73,300 అయింది.