ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్య దినోతవ్సం ( Independence Day ) సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో ( Social Media ) దేశ భక్తిని ప్రస్ఫుటించే ఎన్నో ఫోటోలు వీడియోలు షేర్ అయ్యాయి. అందులో ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్కడిది అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇందులో ఒక పెద్దావిడ దేశ భక్తి కి సరైన ఉదాహరణగా నిలిచింది. జాతీయ జెండా ఉంటే చోటు అది గుడితో సమానం అని ఆవిడ ప్రూవ్ చేసింది. 



వైరల్ వీడియో (Viral Video) లో ఒక పెద్దావిడ రోడ్డు పై వెళ్తుండగా ఆవిడకు జాతీయ జెండా ( Indian National Flag ) కనిపిస్తుంది. అప్పుడే ఎవరో జెండా వందనం సమర్పించి వెళ్లి ఉన్నారని వీడియో చూస్తే అర్థం అవుతుంది. జాతీయ పతాకాన్ని చూడగానే ఆవిడ గుడి ముందు చెప్పులు వదిలినట్టు రోడ్డపై చెప్పులు విచిడే.. అక్కడే తన బ్యాగు పెట్టేసి .. భగవంతుడికి దండం పెట్టిన విధంగా జెండాకు దండటం పెట్టి.. దేవడి కాళ్లను మొక్కనిట్టు జెండాను మొక్కుతుంది. తరువాత కష్టంగా పైకి లేచి తన బ్యాగు తీసుకుని, చెప్పులు వేసుకుని గౌరవంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.



ఈ వీడియో చూసిన వాళ్లందరూ ఆమె దేశ భక్తికి సలాం కొడుతున్నారు. దేశం అంటే ప్రేమ, జాతీయ పతాకం అంటే భక్తి ఉన్న మహా తల్లి అని గౌరవిస్తున్నారు.