Immunity Booster: ఇమ్యూనిటీ పెంచే ఈ టీని తయారు చేయడం చాలా సులభం

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే ప్రధమ కర్తవ్యం. కరోనావైరస్ సమయంలో మరింత అవసరం.  

Last Updated : Aug 17, 2020, 03:42 PM IST
    1. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే ప్రధమ కర్తవ్యం. కరోనావైరస్ సమయంలో మరింత అవసరం.
    2. టీ లవర్స్ కోసం ఇమ్యూనిటీ పెంచే టీ.
    3. న్యూట్రీషనిస్టు, మైక్రోబయాలజిస్టు అయిన శిల్ప ఆరోరా ఈ టీ ఎలా తయారు చేయాలో జీ మీడియా రీడర్స్ కోసం షేర్ చేశారు.
Immunity Booster: ఇమ్యూనిటీ పెంచే ఈ టీని తయారు చేయడం చాలా సులభం

వర్షాకాలంలో( Mansoon ) రోగ నిరోధక శక్తి ( Immunity ) పెంచుకోవడమే ప్రధమ కర్తవ్యం. కరోనావైరస్ ( Coronavirus )  సమయంలో మరింత అవసరం. ఇలాంటి సమయంలో తరచూ టీ ( Tea ) తాగుతూ ఇలా మీరు మీ ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇమ్యూనిటీ పెంచే ఈ టీని తయారు చేయడం సులభం. దీని కోసం ఇంట్లో లభించే పదార్థాలు సరిపోతాయి. ఈ టీ రోజుకు ఒకసారి తీసుకుంటే మీ శరీరంలో రోగనిరోధక శక్తి తప్పకుండా పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ టీ  వాసన కూడా అదిరిపోతుంది. ఇంట్లో లభించే అల్లం (Ginger ) - తులసి ( Basil ) ఆకులతో ఈ టీ తయార చేసుకోవచ్చు.

న్యూట్రీషనిస్టు, మైక్రోబయాలజిస్టు అయిన శిల్ప ఆరోరా ఈ టీ ఎలా తయారు చేయాలో జీ మీడియా రీడర్స్ కోసం షేర్ చేశారు. ఈ చాయ్ తయారు చేసుకోవడానికి అల్లం, తులసితో పాటు మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అవసరం అవుతుంది. కావాలంటే మీరు ఈ పదార్థాలున్నింటినీ కలిపి మిక్సర్ గ్రైండర్ లో వేసి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు.  ఈ మిక్స్ కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, 5 మిరియాలు తీసుకుని మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. 

టీ చేసుకోవడానికి పైన తెలిపిన మిక్స్ ను అల్లం, తులసితో కలిసి రెండు కప్పుల నీటిలో మరిగించాలి. పది నిమిషాలు మరిగించాక ఇమ్యూనిటీని పెంచే బూస్టర్ టీ రెడీ అవుతుంది.

Lucky Man: పవర్ బ్యాంక్ ఆర్డర్ ఇస్తే ఇంటికి ఏం వచ్చిందో తెలుసా ?

Trending News