Cobra Man Viral Video: బావిలో పడిన భారీ నాగుపాము.. ప్రాణాలకు తెగించి మరీ రక్షించిన యువకుడు! వావ్ అనకుండా ఉండలేరు
Viral Video, Young Boy rescues Dangerous Cobra in Well. బావిలో పడిన నాగుపామును ఓ యువకుడు కాపాడాడు. అందుకు అతడు పెద్ద సాహసం చేశాడు.
Young Boy catching Dangerous Cobra in Well very easily with Bare Hands: సాధారణంగా పామును చూస్తేనే చాలా మంది పరుగులు పెడుతారు. భారీ నాగుపాము మనల్ని చూసి బుసకొడితే.. ఇంకేమైనా ఉందా గుండె గుభేలుమంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోతాం. ఎందుకంటే నాగుపాము అత్యంత విషపూరితమైంది కాబట్టి. స్నేక్ క్యాచర్స్ మాత్రమే నాగుపాము, కింగ్ కోబ్రాలను పట్టుకుంటారు. అయితే బావిలో పడిన నాగుపామును ఓ యువకుడు కాపాడాడు. అందుకు అతడు పెద్ద సాహసం చేశాడు. ఆ వీడియోలోని ప్రతి సెకండ్ ఒళ్లుగగుర్లుపొడిచేలా ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ పెద్ద రింగుల బావిలో భారీ నాగుపాము పడి ఉంటుంది. అది ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కడం కుదరదు. ఇది చూసిన ఓ యువకుడు నాగుపామును రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగుతాడు. ఓ చేతిలో సంచి, మరో చేతిలో ఓ స్టిక్ పట్టుకుని నీటి దగ్గరివరకు దిగుతాడు. స్టిక్ సాయంతో నాగుపామును పైకి లేపుతాడు. పట్టులేకపోవడంతో నాగుపాము నీటిలో పడుతుంది.
నీటిలో పాము పారిపోతుండగా యువకుడు స్టిక్ సాయంతో దాన్ని పైకి లేపుతాడు. చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది కాటేయడానికి పైకి లేస్తుంది. అయినా యువకుడు బెదరకుండా నాగుపాము తోకను పట్టుకుని చాలా ప్రయత్నాల తర్వాత సంచిలో బంధిస్తాడు. ఆపై పైకి వచ్చి దాన్ని అడవిలో వదిలేస్తాడు. ఈ వీడియోను 'ది వాయిస్ ఆఫ్ రాజ్ కోట్ న్యూస్' అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి.
Also Read: SreeMukhi Pics: శ్రీముఖి అందాల విందు.. హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోందిగా! పిక్స్ వైరల్
Also Read: MS Dhoni Dance: ఎంఎస్ ధోనీ అదిరే స్టెప్పులు.. పబ్‌లో రచ్చ రంబోల! ఎవరితోనో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.