King Cobra Man Viral Video: స్నేక్ క్యాచర్‌కు కూడా లొంగని భారీ కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ మీదికొచ్చింది! చివరికి ఏమైందంటే
King Cobra Viral Video, Snake Catcher Vava Suresh released Huge King Cobra. కేరళలో స్నేక్ క్యాచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వావ సురేష్ భారీ కింగ్ కోబ్రాను అడవిలో వదిలేశాడు.
Man released big King Cobra very easily in Forest: ప్రపంచంలోనే అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాలలో కింగ్ కోబ్రా (నల్లత్రాచు లేదా రాచనాగు) ఒకటి. సాధారణంగా కింగ్ కోబ్రా 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు 8 కిలోల బరువు ఉంటుంది. దీని విషయం మనిషి మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. కింగ్ కోబ్రా కాటు వలన మనిషి మరణించే అవకాశం 75-90 శాతం వరకు ఉంటుంది. ఎక్కువగా అడవుల్లో ఉండడానికి ఇష్టపడే కింగ్ కోబ్రా.. చాలా అరుదుగా జనాల్లోకి వస్తుంది. అలా వచ్చిన కింగ్ కోబ్రా మనుషులకు అస్సలు భయపడడు. ఒక్కో కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపిస్తుంది. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం.
స్నేక్ క్యాచర్ వావ సురేష్ పాములను రక్షిస్తుంటాడు. సురేష్ కేరళలో చాలా ఫేమస్. జనాల్లోకి వచ్చిన భారీ పాములను సైతం ఆయన సునాయాసంగా పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటాడు. కింగ్ కోబ్రాను కూడా ఉత్తచేతులతోనే పట్టేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో కింగ్ కోబ్రాలను పట్టి అడవుల్లో వదిలేశాడు. అయితే స్నేక్ క్యాచర్‌గా ఎంతో అనుభవం ఉన్న సురేష్‌ని కూడా ఓ కింగ్ కోబ్రా చుక్కలు చూపించింది.
కేరళ రాష్ట్రం లాహాలోని రాజంపర ఫారెస్ట్ ఏరియాలో స్నేక్ క్యాచర్ వావ సురేష్ ఓ భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటాడు. సంచిలో బంధించిన పామును అడవిలో వదిలేస్తాడు. ఆ వెంటనే అది బుసలు కొడుతూ సురేష్ మీదకు దూసుకొస్తుంటుంది. బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న సురేష్.. పాము కాటు నుంచి తప్పించుకుంటాడు. చాలాసార్లు కింగ్ కోబ్రా బుసలు కొడుతూ మీదికొచ్చినా సులువుగా తప్పించుకున్న సురేష్ చివరికి దాన్ని వదిలేస్తాడు. ఈ వీడియో 2018 నాటిది అయినా ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 737,220 వ్యూస్ వచ్చాయి.
Also Read: నువ్ సూపర్ బాసూ.. ఏ సాయం లేకుండా భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!
Also Read: Pragya Jaiswal Pics: శారీలో ప్రగ్యా జైస్వాల్.. ఏం అందంరా బాబు! అచ్చం సిమ్లా ఆపిల్‌లా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook