OnePlus Nord 2 5G phone blasted: వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయి కేవలం ఐదు రోజులే అవుతోంది. జులై 28నే వన్‌ప్లస్ నాడ్ 2 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతలోనే బెంగళూరు నుంచి అంకుర్ శర్మ అనే ఓ వ్యక్తి తన భార్య వినియోగిస్తున్న వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ స్లింగ్ బ్యాగ్‌లో ఉండగా పేలిందంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. గతంలో అనేకసార్లు ఫోన్లు చార్జింగ్ పెడుతుండగా పేలిన సందర్భాలున్నాయి. అయితే, ఈసారి ఈ ఘటనలో ఆమె బైక్‌పై వెళ్తుండగా బ్యాగులో ఉన్న ఫోన్ పేలింది. అనుకోని పరిణామంతో తన భార్య బైక్ బ్యాలెన్స్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు అంకుర్ శర్మ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ పేలింది అనే ట్వీట్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మార్ట్ ఫోన్ యూజర్స్ (Smartphone users) ఈ ఘటనపై స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది. దీంతో వన్ ప్లస్ కంపెనీకి సైతం ఈ ఉదంతంపై స్పందించక తప్పలేదు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని ట్విటర్‌లోనే ఓ పోస్ట్ పెట్టిన వన్ ప్లస్ కంపెనీ... అంకుర్‌ని డైరెక్ట్ మెసేజ్ ద్వారా తమతో టచ్‌లోకి రావాల్సిందిగా కోరింది.



Also read : వాట్సాప్‌ ఫీచర్స్‌తో సందేశ్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం


విచిత్రం ఏంటంటే.. వన్ ప్లస్ స్పందించిన అనంతరం అంకుర్ శర్మ తన ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ఏదేమైనా ఈ ఘటనతో వన్‌ప్లస్ నాడ్ 2 5G స్మార్ట్ ఫోన్ (OnePlus Nord 2 5G phone) అంత సేఫ్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్యామేజీ నుంచి వన్ ప్లస్ కంపెనీ ఎలా బయటపడుతుందో చూడాలని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.


Also read : Aadhaar Card: ఆధార్ అప్‌డేషన్‌లో కొత్త సౌలభ్యం, ఫోటో మార్చడం ఎలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook