Man Bike Lifting Video: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ శివ లింగాన్ని ఎత్తినప్పుడు మనమందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. శివ లింగాన్ని అలా ఎత్తుకోవడం రీల్ లైఫ్‌లో తప్పితే.. నిజ జీవితంలో సాధ్యం కాదని అందరూ అనుకున్నారు. కానీ ఓ వ్యక్తి బైక్‌ని తలపై ఎత్తుకుని ఏకంగా బస్సు ఎక్కేశాడు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బస్ స్టాప్‌లో కూలీ పని చేసే వ్యక్తి పెద్ద సాహసం చేశాడు. దాదాపుగా 150 కిలోల బరువున్న బైక్‌ని తలపై ఎత్తుకున్నాడు. అనంతరం నిచ్చెన సాయంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ బస్సు పైకి చేరాడు. బస్సు పైనున్న వ్యక్తి బండిని అందుకుని పైన పెట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూస్తే ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 



బైక్‌ని తలపై ఎత్తుకుని నిచ్చెన ఎక్కుతున్న సమయంలో అతడిని చూసి అందరూ ఆచ్చర్యపోయారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల వ్యూస్ రాగా.. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. మరోవైపు కామెంట్ల వర్షం కురుస్తోంది. 'రియల్ బాహుబలి' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'వీడియో చూస్తే ప్రభాస్ కూడా బిత్తరపోతాడు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ బరువైన శివలింగాన్ని ఎత్తగా.. ఫోర్స్ చిత్రంలో జాన్ అబ్రహం బైక్ ఎత్తిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఈ రోజుల్లో ఓ వ్యక్తి బైక్‌ను తలపై ఎత్తుకోవడం అనేది మాములు విషయం కాదు. 


Also Read: CWG 2022: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ!


Also Read: రూ.1999కే శాంసంగ్‌ గ్యాలెక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 ప్రీ-బుకింగ్.. 5 వేల ప్రత్యేక ఆఫర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook