Slowest Train in India: ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్‌వర్క్ కలిగిన సంస్థగా ఇండియన్ రైల్వేస్‌కి పేరు ఉంది. ప్రయాణికులను త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చేలా రివ్వున దూసుకుపోయే హై స్పీడ్ రైళ్లు ఇండియన్ రైల్వే సొంతం. కొత్తగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, దురొంతో ఎక్స్‌ప్రెస్.. ఇలాంటి రైళ్లన్ని వేగంగా పరుగెత్తేవే. ఇలాంటి హై స్పీడ్ రైళ్లో ప్రయాణించిన అనుభవం మీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఉండొచ్చునేమో కానీ ఎప్పుడైనా ఇండియాలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుని ఎక్కారా ? ఇండియాలోనే స్లోయెస్ట్ ట్రెయిన్‌గా పేరున్న ఈ రైలులో ఎప్పుడైనా ప్రయాణించారా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏంటి స్లోయెస్ట్ ట్రెయిన్ అని కూడా ఒకటుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ రైలు వేగం ఎంతో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అవును.. ఆ రైలు గంటకు కేవలం 10 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంతకీ ఈ రైలు పేరు ఏంటి ? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అనే కదా మీ సందేహం... ఆగండి ఆగండి.. మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాం. 


ఇండియాలోనే స్లోయెస్ట్ ట్రెయిన్‌గా పేరున్న ఈ రైలు పేరు మెట్టుపాలాయం - ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రెయిన్. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాలాయం నుంచి నీలగిరీస్ జిల్లాలోని ఊటి మధ్య ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణిస్తుంది. మెట్టుపాలాయం - ఊటి మధ్య ఉన్న దూరం కేవలం 46 కిమీ మాత్రమే కానీ గమ్యస్థానం చేరుకోవడానికి 50 నిమిషాలు పడుతుంది. మధ్యలో కెల్లర్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్‌డేల్, ఊటకముండ్ పేర్లతో ఐదు రైల్వే స్టేషన్స్ మాత్రమే వస్తాయి. 


ఇండియాలో వేగంగా ప్రయాణించే రైళ్లతో పోలిస్తే.. దీని వేగం 16 రెట్లు తక్కువ. ఇంత నెమ్మదిగా ప్రయాణించే రైలుని ఎవరు ఎక్కుతారులే అని లైట్ తీసుకోకండి.. ఎందుకంటే ఈ రైలులో వెళ్లే ప్రయాణికులకు కొదువే లేదు. కాదు కాదు.. భారీ డిమాండ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్టుపాలాయం నుంచి ఊటి వరకు రైలు మార్గం ఇరువైపులా ప్రకృతి సోయగాలే. ఆ ప్రకృతి అందాలు, నీలగిరి కొండల సొగసులు చూస్తూ పరవశించిపోవాలంటే రైలు అలా వెళ్లడంలోనే అసలు మజా ఉంటుంది. అందుకే ఊటికి వెళ్లే పర్యాటకుల్లో చాలా మంది ఈ రైలులోనే వెళ్లి ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకుంటుంటారు. ఇటీవల కొత్తగా లాంచ్ అయిన వందే భారత్ రైలుకు ఎలాంటి డిమాండ్ అయితే ఉందో.. అలాంటి క్రేజ్ ఈ రైలు విషయంలోనూ కనిపిస్తుందంటున్నారు అక్కడి పర్యాటకులు.


రైలులో కూడా అన్ని రైళ్ల తరహాలోనే ఫస్ట్ క్లాస్, జనరల్ క్లాస్ కేటగిరి బోగీలు ఉంటాయి. ఎవరి సౌకర్యం ప్రకారం వారు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మెట్టుపాలాయం - ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రెయిన్ ప్రత్యేకత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. యునెస్కో (UNESCO) వారు కూడా ఈ రైలుని 2005 లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించడం విశేషం. ఇలాంటి మరెన్నో వింతలు, విశేషాలు, ఆసక్తికరమైన కథనాల కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.


ఇది కూడా చదవండి : Free Condoms On Valentine's Day: వాలెంటైన్స్ డే రోజున ఫ్రీ కండోమ్స్.. ఎందుకో తెలుసా ?


ఇది కూడా చదవండి : Valentines Day 2023: వాలెంటైన్స్ డే లోగా బాయ్ ఫ్రెండ్‌ కావాలి.. కాలేజ్ నోటీస్ వైరల్


ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook