భారతీయ రైల్వే ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. గంటకు 200 కిలోమీటర్ల వరకూ వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక రైళ్లివి. ఇప్పుడిక ఏపీకు కూడా ఈ అవకాశం లభించింది. ఆ వివరాలు మీ కోసం..
గంటకు 160-200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. భారతీయ రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన ఈ రైళ్లు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. వాస్తవానికి ఈ రైలు గరిష్ట వేగం 200 కిలోమీటర్లు కాగా..రైల్వే అధికారులు 180 కిలోమీటర్లకు నిర్ధారించారు. ట్రాక్ సామర్ధ్యాన్ని బట్టి గంటకు 160 కిలోమీటర్ల వరకూ తిరుగుతాయి. సాధారణంగా దేశంలో ఇప్పటికవరకూ వివిధ రైళ్ల గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. గోదావరి, ఫలక్‌నుమా, శాతవాహన, విశాఖ, సింహపురి, కోణార్క్, గోల్కొండ, గౌతమి, దురంతో, గరీబ్‌రథ్ వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల వేగమిదే.
ఇప్పుడు త్వరలో గంటకు 160 కిలోమీటర్ల వేగం వరకూ దూసుకెళ్లే వందేభారత్ రైలు విజయవాడకు రానుంది. ఈ రైలును విజయవాడ-సికింద్రాబాద్ లేదా విశాఖపట్నం-విజయవాడ-సికింద్రబాద్ రెండు రూట్లలో ఏ రూట్లో నడపాలనే విషయం దక్షిణ మధ్య రైల్వే ఆలోచిస్తోంది. విజయవాడ-సికింద్రాబాద్ గోల్డెన్ డయాగ్నల్ రూట్ కాగా, విశాఖపట్నం-విజయవాడ గోల్డెన్ క్వాడ్రలేటర్ రూట్స్ పరిశీలనలో ఉన్నాయి. అత్యంత వేగంగా వెళ్లడమే కాకుండా..అత్యంత ఆధునిక వసతులతో ఉంటాయి వందేభారత్ కోచ్‌లు.
Also read: Ys Jagan: వై నాట్ 175, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధీమా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook