Person Swallowed Alive Snake: మనలో చాలా మంది పామును చూస్తేనే గజ-గజ వణికి పోతుంటాము. పాము కాటుకు గురైన ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ ఒక వ్యక్తి సజీవంగా ఉన్న పామును మింగేశాడు.. అవును ఇది నినటానికి ఇబ్బందిగా ఉన్న అది మాత్రం నిజం. ఇలాంటి ప్రమాదకర స్టంట్ చేసిన ఆ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుక, గొంతులో కాటు వేసిన పాము 
రష్యా ఆస్ట్రాఖాన్ (Russia Astrakhan) కు చెందిన 55 ఏళ్ల వ్యవసాయ కూలీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పామును వ్యక్తి మింగటం మనం గమనించవచ్చు.  డైలీ స్టార్ (Dialy Star) వెల్లడించిన నివేదిక ప్రకారం, ఆ వ్యక్తి పామును మింగటానికి రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ మూడవ సారి ప్రయత్నిస్తుండగా.. అతడి నాలుకకు పాము కాటు వేసింది. అప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆగకుండా పామును మింగటానికి ప్రయత్నించగా, పాము గొంతు లోపల భాగంలో కూడా మరోసారి కాటువేసింది.  


Also Read: Sneha Dubey at UNGA:ఎవరు ఈ స్నేహా దుబే..? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరాలు


క్షీణించిన ఆరోగ్యం 
పాముకాటు తరువాత కొన్ని గంటల్లో అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించటం మొదలైంది. చికిత్స కోసం అతడిని ఆసుపత్రిలో చేర్చగా...ఆ వ్యక్తికీ అలర్జీ సోకిందని డాక్టర్లు తెలిపారు. పాము కాటు కారణంగా నాలుక మరియు గొంతు తీవ్రమైన వాపుకు గురయ్యాయి. ఆ వ్యక్తి  అనాఫిలాక్టిక్ షాక్‌కు (Anaphylactic Shock) గురయ్యాడని వైద్యులు వెల్లడించారు. అనగా శరీరంలో ప్రవేశించిన యాంటిజెన్‌కు కారణంగా బాడీ హైపర్సెన్సిటివ్‌గా మారి, ప్రాణాంతకర అలెర్జీ గా మారటాన్ని అనాఫిలాక్టిక్ షాక్‌ అంటారు. ఫలితంగా వ్యక్తి నాలుక విపరీతంగా ఉబ్బటం కారణంగా శ్వాసలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మరణించాడని వైద్యులు తెలిపారు. 


పాములు మింగటం ఆక్కడి ఆచారం 
డైలీ స్టార్ వెల్లడించిన నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలలో పాములను మింగే సాంప్రదాయ అలవాటు ఉంది. పుచ్చకాయ పొలాలలో స్టెప్ వైపర్ (Step Viper) అనే పాము ఆ వ్యక్తికీ కనబడింది. ఆ పాము చెప్పుకోదగ్గంత విషపూర్తితం కానప్పటికీ, మానవులకు ప్రమాదం జరగవచ్చు. ఈ సంఘటన జరిగినప్పటీ నుండి అక్కడై పాలకులు పాములను మింగే ఆచారం ఆపివేయాలని వాటి వలన ప్రాణాలు కోల్పోయే  ప్రమాదం ఉందని వారు తెలుపుతున్నారు. 


Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరేసిన వధువు.. Viral Video


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook