వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరేసిన వధువు.. Viral Video

సాధారణంగా పెళ్లిలలో స్నేహితులు వధు- వరులను ఆటపట్టిస్తుంటారు కదా.. కానీ ఈ వీడియో చూస్తే తప్పకుండా షాక్ అవుతారు.. వరుడు తాళి కడుతుంటే... మంగళ సూత్రం నేలకోసి కొట్టి.... తరువాత ఏం జరిగిందో మీరే చూడండి !

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 05:15 PM IST
  • పెళ్లిలో మజాక్, జోక్స్ సాధారణమే
  • కానీ వధువే తాళికట్టే సమయంలో ప్రాంక్ చేస్తే
  • మంగళ సూత్రం పడేసి వెళ్ళిపోయిన వధువు
  • షాక్ లో పెళ్ళికొడుకు, బంధువులు
వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరేసిన వధువు.. Viral Video

Bride Prank on Her Own Wedding: ఇంట్లో పెళ్లి అంటేనే సంబరం.. ఉత్సాహం. బంధువుల మధ్య జోకులు, టీజింగ్ ఇలా  వివాహ వేడుకలో ఊహించని సంఘటనలు కుటుంబ సభ్యులను షాక్ కు గురిచేస్తుంటాయి. వరుడు తాళి కట్టే ముందు వరకు వధువు సైలెంట్ గా ఉండటం, తరువాత ఎవరొకరి ఆపండి అనటం.. సినిమాలో ఇలాంటి సీన్లు చాలా సాధారణం. కానీ ఇలాంటి ఒక సీన్ నిజంగా ఒక పెళ్లిలో జరిగింది. తాళి కట్టబోతున్న వరుడు చేతిలో ఉన్న తాళిని తీసి నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది ఒక యువతి.. ఆ వీడియో ఏంటో చూద్దాం..??

నెట్ లో చాలా రకాల వివాహానికి సంబంధించిన వైరల్ వీడియోలు చూసి ఉంటాము.. కానీ ఈ వీడియోకి ఒక వింత యాక్ట్ ఒకటి చేర్చబడింది. నిజానికి భయటివారు కాకుండా ఏకంగా పెళ్లి కూతురే.. పెళ్లి కొడుక్కి పెద్ద షాక్ ఇచ్చింది. వధువు పెళ్లి మండపం నుండి పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోవటం మళ్లీ అది ప్రాంక్ అని చెప్పి రావటం... ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది 

Also Read: United Nations: ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ను తప్పుబట్టిన భారత్

సాధారణంగా పెళ్లి రోజున స్నేహితులు వరుడు-వధువుపైన లేదా వారి మధ్యలో జోక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ వీడియో లో జరిగిన సన్నివేశం పెళ్ళికొడుకునే కాదు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్య పరచింది. యధావిధిగా ముహూర్తం సమయానికి పంతులు చెప్పాడన్ని తాళి తీసుకొని వధువు మెడలో కట్టడానికి లేచి నిలబడి కట్టబోతుంటాడు.. అంతే ఉన్నట్టుండి ఆ వధువు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ మంగళ సూత్రాన్ని నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది... అది చూసిన పెళ్లి కొడుకు, జనాలు అందరు సైలెంట్ అయిపోతారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niranjan Mahapatra (@official_viralclips)

వధువు చేసిన ఈ పనికి కాసేపు ఎవరికీ అర్థం కాకున్నా... కాస్త ముందుకి వెళ్లి మళ్లీ తిరిగి బిగ్గరగా నవ్వుతూ వెనక్కి వస్తుంది. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది వధువు కావాలని ప్రాంక్ చేసి పెళ్లికొడుకుతో సహా అందరిని ఫూల్ చేసిందని. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి  మరీ!

Also Read: Sneha Dubey at UNGA:ఎవరు ఈ స్నేహా దుబే..? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

More Stories

Trending News