Tiger Viral Video: సోషల్ మీడియాలో పులులు, సింహాల వీడియోలకు క్రేజ్ ఎక్కువ. నిద్రపోతున్న పులిని లేపితే ఎలా ఉంటుంది. అంతే తిరగబడింది. సరైన బుద్ధి చెప్పింది. అసలేం జరిగింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పులులు సాధారణంగా రాత్రిపూటే వేటాడుతుంటాయి. కారణం ఇవి నిశాచర జీవులు. పగలు మాత్రం హాయిగా పడుకుంటాయి. రోజుకు 18-20 గంటలు పడుకుంటాయని అంచనా. పులులు ఒంటరిగానే వేటాడుతాయి. ఆడ పులులు మాత్రం పిల్లలతో కలిసి వేట సాగిస్తాయి. ఎందుకంటే పిల్లలకు వేట నేర్పడం, తద్వారా తమ ఆహారాన్ని తామే ఎలా సాధించుకోవాలో ఆడ పులులు అంటే తల్లి పులులు నేర్పిస్తాయి. అందుకే సమయం ఉన్నప్పుడు కాస్త నిద్రపోవడం ద్వారా ఎనర్జీ సంపాదించుకుంటాయి.


అయితే ఈ వ్యవహారమంతా పాపం ఆ పిల్ల పులికి తెలియదు. తల్లికి నిద్ర ఎంత అవసరమో అసలు తెలియదు. తెలియక తల్లి నిద్రను డిస్ట్రబ్ చేసేసింది. అంతే ఒక్కసారిగా నిద్రలేచిన తల్లికి చికాకేసింది. కోపంతో పిల్ల పులిపై పంజాతో తిరగబడింది. నిద్ర డిస్ట్రబ్ చేసినందుకు సరైన బుద్ధి చెప్పింది. పాపం చేసేది లేక వెనుకంజ వేసి మౌనంగా ఉండిపోయింది పిల్ల పులి. ఇదంతా జూలో జరిగిన ఘటన. రెండు పులుల దెబ్బలాటను గ్లాస్‌లోంచి చూస్తున్న ఓ చిన్నారి ఒక్కసారిగా భయపడిపోయాడు. వీడియోలో ఇదంతా స్పష్టంగా రికార్డౌంది.



ఈ వీడియో 2016లో ఐర్లాండ్‌లోని డబ్లిన్ జూలో చిత్రీకరించింది. ఇప్పటి వరకూ 15 లక్షలకు పైగా వీడియోను వీక్షించారు. భారీగా కామెంట్లు వస్తున్నాయి. 


Also read: King Cobra Video: ఆగ్రహానికి గురైన కోబ్రా.. స్నేక్‌ క్యాచర్‌ను ఏం చేసిందో చూడండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook