మన జీవతంలో వాస్తు ( Vastu ) చాలా ప్రాధాన్యత ఎక్కువ. వాస్తు మార్గంలో మనం మన సమస్యలను దూరం చేసుకుంటాం. ఈ రోజు మనం కృష్ణుడి ( Sri Krishna ) ఫోటోను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి అనేది తెలుసుకుందాం. నేడు కృష్ణ జన్మాష్టమి ( Janmastami ). అంటే నేడు నంద కిశోరుడిగా భగవాన్ వాసుదేవుడు మానవరూపంలో అవతరించిన రోజు. ప్రపంచం మొత్తం కృష్ణ తత్వం తెలుసుకునే ప్రయత్నం చేసే ముఖ్యమైన రోజు ఇవాళ. అందుకే వాస్తు ప్రకారం కృష్ణుడి ఫోటోను ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం.



 శ్రీకృష్ణుడి ఫోటోను మీరు ఈశాన్యం వైపు ఉంచడం మంచిది. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది. బంధాలు పటిష్టం అవుతాయి. ఈ దిశలో మాధవుడి ఫోటో పెట్టడం వల్ల మనిషిలో దివ్యత్వం, నమ్మకం కలుగుతుగుంది. ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం మంచిది. తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో వల్ల ఇంట్లో సంపద ( Wealth ) కలుగుతుంది.



 శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు ఆగ్నేయ దిశలో పెడితే  ఇంట్లో దివ్య శక్తి జనిస్తుంది. అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ( Govardhan Giri ) ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు, విపత్తులు తొలగిపోతాయి. ఇక నైరుతి దిశలో శ్రీకృష్ణుడి చిత్రాలు పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి. వాయవ్య దిశలో రాధ-గోపాలుడి ఫోటోలు పెట్టడవ వల్ల మనిషికి సహజంగా కలిగే బాధలు తీరిపోతాయి.