శ్రీకృష్ణుడు మధురలో భాద్రపద మాసంలోని ఎనిమిదవ రోజు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు హిందూ మతంలో భాగం అయిన వైష్ణవులకు అత్యంత ప్రధానమైన రోజుగా కీర్తిస్తారు. ఇవాళ భక్తులు శ్రీకృష్ణుడి భక్తి గీతాలు ఆలపిస్తారు. రాత్రంతా జాగారణ చేస్తారు.
తిథి:
అష్టమి ప్రారంభం- 2020 ఆగస్టు 11 ఉదయం 09:06 లకు
అష్టమి ముగిసేది- 2020 ఆగస్టు 12 ఉదయం 11:16 లకు
నిశిత పూజ: ఆగస్టు 12.17 Am నుంచి 01.02 Am వరకు
దహి హండి: బుధవారం 2020 ఆగస్టు 12
Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
వ్రతం:
ద్రిక్ పంచాంగం ప్రకారం జన్మాష్టమి రోజు ఉపవాసం చేసే భక్తులు కేవలం ఒకసారి మాత్రం భుజించాలి. అది కూడా జన్మాష్టమికి ముందు. రోజు మొత్తం ఉపవాసం చేయాలి అని భక్తులు సంకల్పం చేయాలి. దాన్ని మరుసటి రోజు వచ్చే రోహిణి నక్షత్రం, అష్టమి తిథి ముగిశాక ముగించాలి. కొంత మంది భక్తులు ఉపవాసం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి ముగిసిన తరువాత ముగిస్తారు.