అల్లాఉద్దిన్ అద్భుత దీపం దొరికితే అందులో నూనెపోసి దీపం పెట్టినట్టు ఉంది ఈ వీడియోలో ( Trending Video ) మొసలి వ్యవహారం. అవకాశం ఉన్నంత వరకు వేచి చూసి... అవకాశం చేజారిపోయాక రియాక్ట్ అయితే లాభం లేదు. కానీ ఈ విషయం ఈ మొసలికి ( Crocodile ) అర్థం అయ్యేవరకు చాలా లేట్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా షేర్ అవుతోంది. సాకులు చెప్పడం కాదు... అవకాశాల్ని వాడుకోవడం రావాలి అని అంటున్నారు నెటిజెన్స్ ( Netiznes ).




ఈ వీడియో రెండు మొసలి రాజుల వైఫల్యాన్ని చూపిస్తుంది. స్టార్టింగ్ లోని నీటి గట్టున ఒక మొసలి ఉన్నట్టు.. తరువాత నీటిలో ఒక మొసలి ఉంటుంది. ఒడ్డున్న ఉన్న మొసలి నోటిపై ఒక కోడి నిలబడి మొసలి నోటి దగ్గరి నుంచి కిందికి దిగుతుంది. కోడి ఇలా దిగీదిగగానే మొసలి వెంటనే నోరు తెరుస్తుంది. అచ్చం నీరు వెళ్లిపోయాక ఆనకట్టకట్టినట్టు. ఇటు ఒడ్డుపై ఉన్న మొసలి.. అటు నీటిలో ఉన్న మొసలి రెండూ కోడిని మిస్ అయిపోతాయి. కొత్త నీతి కథగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.