Tempo with Fish Load Overturns: రోడ్డుపై గూడ్స్ లారీ బోల్తా పడిందంటే... దాని చుట్టూ జనం గుమిగూడటం... అందులో పనికొచ్చే వస్తువులేమైనా ఉంటే ఎత్తుకెళ్లడం చాలా సందర్భాల్లో చూసిందే. ఆయిల్, బీర్లు, కోడిగుడ్లు.. ఇలా తదితర గూడ్స్‌తో వెళ్లే లారీలు బోల్తా పడినప్పుడు జనం పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు. అందినకాడికి దోచుకెళ్లేందుకు పోటీపడుతుంటారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ టెంపో బోల్తా పడటంతో జనం పండగ చేసుకున్నారు. రోడ్డుపై పడిపోయిన చేపల కోసం పెద్ద ఎత్తున ఎగబడి అందినకాడికి దోచుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని సహస్ర జిల్లాలో శనివారం (మే 28) చేపల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా కొట్టింది. ఇక్కడి రోడ్డుపై భారీగా నీరు నిలిచి ఉండటంతో ఆ లారీ అకస్మాత్తుగా బోల్తా పడింది. లారీలోని చేపలన్నీ రోడ్డుపై పడటంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. కొంతమంది బుట్టల్లో, కొందరు బకెట్లలో.. ఆఖరికి తలకు ధరించే హెల్మెట్లలోనూ చేపలను పట్టుకుని తీసుకెళ్లారు. దీని కారణంగా రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 


ఇక్కడి రోడ్డు చాలాకాలంగా అద్వాన్న స్థితిలో ఉందని స్థానికులు వాపోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమైనప్పటికీ... అధికారులు ఈ రోడ్డుకు మరమత్తులు చేయించట్లేదని ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డు చెరువును తలపిస్తుందని... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ మార్గంలో తరచూ వాహనాలు ప్రమాదానికి గురవుతుండటంతో ఇకనైనా స్థానిక నేతలు, ప్రభుత్వ అధికారులు రోడ్డుకు మరమత్తులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.  


కాగా, ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బీర్ బాటిల్స్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ సింగరాయకొండ సమీపంలో బోల్తా  కొట్టింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఎగబడి... ఒక్కొక్కరు పదేసి బాటిల్స్ ఎత్తుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 



Also Read: Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి... 


Also Read: JSSC Recruitment 2022: 12వ తరగతి ఉత్తీర్ణతతో ప్రభుత్వ ఉద్యోగం... దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే... పూర్తి వివరాలివే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook