Andhra Pradesh Kurnool district Bheemunipadu Pancha Brahma Lingeshwara Temple specialities: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడులో వెలసిన పంచబ్రహ్మలింగేశ్వర ఆలయానికి (Pancha Brahma Lingeshwara Temple)ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలోనే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా (పంచబ్రహ్మలు) కలిపి ఇక్కడ శివలింగాన్ని (Sivalingam) ప్రతిష్టించడమే ఇక్కడి ప్రత్యేకత. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏటా మహాశివరాత్రి (Mahashivaratri) పండుగ రోజున దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నది జలాలతో ఈ పంచబ్రహ్మలింగేశ్వరుడికి ఎంతో వైభవంగా అభిషేకం చేస్తారు. ఒక్కో సంవత్సరం ఒక్కో నది నుంచి 25 లీటర్ల చొప్పున నది జలాలను (River waters) తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. 


Also Read : Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు


ఇప్పటి వరకు గంగ, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, నర్మద నదుల నీటితో పంచబ్రహ్మలింగేశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. అలాగే ఆలయం ఎదుట 14 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన 68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. 


దేశంలోనే రెండో అతిపెద్ద ధ్వజస్తంభంగా ఇది పేరుగాంచింది. కర్నాటకలోని (Karnataka) హోస్పెట్‌ (Hospet‌) నుంచి ఏకశిలా రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి భీమునిపాడు పంచబ్రహ్మలింగేశ్వర ఆలయంలో (Bheemunipadu Pancha Brahma Lingeshwara Temple) ప్రతిష్టించారు. దేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం కర్నాటక ఉండగా రెండోది ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపాడులో ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది భీమునిపాడు పంచబ్రహ్మలింగేశ్వర ఆలయం (Temple).


Also Read : Ind vs Pak: India పై పాకిస్తాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న ఘటనల్లో ఐదుగురు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook