Shirley Temple google doodle: షిర్లె టెంపుల్‌కి గూగుల్ డూడుల్‌ నివాళి

Shirley Temple's google doodle story: షిర్లే టెంపుల్.. 'అమెరికాలో గొప్ప నటి' అని సింపుల్‌గా చెబితే అది ఆమెను అవమానించినట్టే అవుతుంది. మూడేళ్లకే డ్యాన్సింగ్ మొదలుపెట్టి, సరిగ్గా ఆరేళ్లు ఉన్నప్పుడే డజన్‌కి పైగా సినిమాల్లో బాల నటిగా ఔరా అనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న షిర్లే టెంపుల్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయినట్టే ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2021, 09:36 AM IST
Shirley Temple google doodle: షిర్లె టెంపుల్‌కి గూగుల్ డూడుల్‌ నివాళి

Shirley Temple's google doodle story: షిర్లే టెంపుల్.. 'అమెరికాలో గొప్ప నటి' అని సింపుల్‌గా చెబితే అది ఆమెను అవమానించినట్టే అవుతుంది. మూడేళ్లకే డ్యాన్సింగ్ మొదలుపెట్టి, సరిగ్గా ఆరేళ్లు ఉన్నప్పుడే డజన్‌కి పైగా సినిమాల్లో బాల నటిగా ఔరా అనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న షిర్లే టెంపుల్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆమె జీవితం ఆద్యంతం ఎక్కడా బ్రేకుల్లేని ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ. సాధారణంగా చాలా మంది పెరిగి పెద్దయ్యాకా ఎంతో కష్టపడి సక్సెస్‌ని అందుకుంటారు. కానీ షిర్లే టెంపుల్ విషయంలో అలా కాదు. మూడేళ్ల ప్రాయం నుంచే ఆమె ఒక ఐకానిక్ చైల్డ్ స్టార్ (Child star). నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పుడే అమెరికా ప్రతినిథిగా ఐక్య రాజ్య సమితిలో అడుగుపెట్టడం, 60 ఏళ్లకు అమెరికా హానరరి ఫారెన్ సర్వీస్ ఆఫీసర్‌గా అపాయింట్ అవడం వరకు ఎక్కడా ఆమె సక్సెస్ అగింది లేదు. 

Shirley Temple's life journey: షిర్లే టెంపుల్ జీవిత ప్రస్థానం
షిర్లే టెంపుల్ లైఫ్ జర్నీ, కెరీర్ హైలైట్స్ గురించి వివరించి చెప్పాలంటే సమయం సరిపోదు. జీవితంలో అడుగడుగునా ఓ కొత్త కోణాన్ని స్పృశిస్తూ వెళ్లిన ధీరవనిత షిర్లే టెంపుల్. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా మొనికలో 1928, ఏప్రిల్ 23న షిర్లే టెంపుల్ జన్మించింది. మూడేళ్ల వయస్సున్నప్పుడు డ్యాన్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిన షిర్లే టెంపుల్.. ఆరేళ్ల వయస్సులో బుడి బుడి అడుగులేస్తూనే అమెరికా మెచ్చిన యంగ్ డ్యాన్సర్ అనిపించుకుంది.

Shirley Temple's google doodle story: షిర్లే టెంపుల్ గూగుల్ డూడుల్ వీక్షించడం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Shirley Temple's cinema journey: షిర్లే టెంపుల్ సినిమా కెరీర్
1934లో.. అంటే తనకు ఆరేళ్లు ఉన్నప్పుడే డజన్‌కి పైగా సినిమాల్లో నటించి బాల నటిగా అమెరికన్ల దృష్టిని ఆకర్షించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే హాలీవుడ్‌లో డ్యాన్సర్‌గా నటిగా, సింగర్‌గా రాణించి యంగ్ పర్‌ఫార్మర్‌గా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 1942లో జూనియర్ మిస్ (Junior Miss) అనే రేడియో షో ద్వారా అమెరికన్లకు మరింత చేరువయ్యింది. ఇప్పుడు టీవీ షోలో వస్తున్న స్టాండప్ కామెడీ లాంటిదే అప్పట్లో షిర్లె టెంపుల్ చేసిన ఆ జూనియర్ మిస్ అనే రేడియో షో కూడా. చిన్న వయస్సులోనే హాలీవుడ్‌లో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న షిర్లే టెంపుల్ 22 ఏళ్ల ప్రాయంలోనే హాలీవుడ్‌కి (Shirley Temple in Hollywood) గుడ్ బై చెప్పేసింది.

Also read : WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది

Shirley Temple work in international relations: అమెరికా తరపున అంతర్జాతీయ సంబంధాల్లో షిర్లే టెంపుల్ పాత్ర
అమెరికా తరపున 1969లో ఐక్య రాజ్య సమితిలో తొలిసారిగా అడుగుపెట్టిన షిర్లే టెంపుల్ అక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి యావత్ ప్రపంచం ఇప్పుడు ఆందోళన చెందుతోంది. అయితే, షిర్లే టెంపుల్ ప్రపంచానికి రాబోయే ముప్పు గురించి ముందే పసిగట్టున్నారు. అందుకే పర్యావరణం గురించి 1972లో జరిగిన ఓ సదస్సులో తన వాదనలు వినిపించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 1988లో హానరరి ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా నియమితులైన షిర్లే టెంపుల్.. ఆ తర్వాత కాలంలో వయోభారంతో రాజకీయాలకు దూరమయ్యారు. 

Also read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung 

Shirley Temple's death: షిర్లే టెంపుల్ మరణం
2014లో ఫిబ్రవరి 10న 85 ఏళ్ల షిర్లే టెంపుల్ క్యాలిఫోర్నియాలో కన్నుమూశారు. జీవితంలో ఆమె సాధించిన విజయాలకు జ్ఞాపకార్థంగా శాంటా మొనిక హిస్టరీ మ్యూజియం వాళ్లు 2015 జూన్ 9న.. లవ్ షిర్లే టెంపుల్ పేరుతో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు అన్నమాట. షిర్లే టెంపుల్ మధుర స్మృతులను ముందు తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా వాళ్లు చేసిన ఈ ప్రయత్నాన్ని స్మరించుకుంటూ నేడు గూగుల్ (Google fined) ఇలా గూగుల్ డూడుల్‌తో (Google doodle honours 'love, shirley temple' anniversary) మరోసారి షిర్లే టెంపుల్‌ని ఈ తరం వారికి పరిచయం చేసింది. అదండీ షిర్లే టెంపుల్ గూగుల్ డూడుల్ వెనుకున్న కథా కమామిషు.

Also read : Whatsapp Grievance: వాట్సప్ గ్రీవెన్స్‌కు ఇలా ఫిర్యాదు చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News