Hanuman Chalisa Reading Rules: మన జీవితంలో ఏర్పడే ప్రతికూలతలను ఆంజనేయస్వామి తొలగిస్తారు. అయితే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపించడం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ హనుమాన్ చాలీసాను శ్రద్ధగా పఠిస్తే.. ప్రతికూలతలు తొలగిపోవడం సహా నూతనోత్సాహాన్ని నింపుతుందని భక్తుల అభిప్రాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే హనుమాన్ చాలీసా జపించే ముందు కొన్ని నియమాలు పాటించాలి. అలాంటి నియమాలు పాటిస్తూ హనుమాన్ చాలీసా జపించడం వల్ల పూర్తి ప్రభావం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


హనుమాన్ చాలీసా జపించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు


హిందువులలో చాలా మంది హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా జపిస్తారు. కానీ, వారు పూర్తి ప్రయోజనాన్ని పొందరు. తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారికి ఆ ప్రయోజనం దక్కడం లేదు. అలాంటి పరిస్థితుల్లో హనుమాన్ చాలీసాను పఠించే ముందు పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం. 


హనుమాన్ చాలీసాను జపించడం మంగళవారం ప్రారంభిస్తే బాగుంటుంది. ఆ రోజు పొద్దున్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఆంజనేయస్వామి విగ్రహం లేదా ప్రతిమను ప్రతిష్టించాలి. హనుమాన్ చాలీసా చదివే ముందు గణేశుడిని పూజించాలి. 


గణేశుడిని పూజించిన తరువాత.. సీతారాముల వారిని ప్రార్థిస్తూ.. కరుణించమని కోరుకోవాలి. ఆ తర్వాత బజరంగబలి ఆంజనేయస్వామికి నమస్కరించి.. హనుమాన్ చాలీసా పారాయణ ప్రతిజ్ఞ చేయాలి. హనుమంతుడి ప్రతిమ ముందు ధూపదీపాన్ని వెలిగించి.. పువ్వులు సమర్పించి, చాలీసాను జపించడం ప్రారంభించాలి. హనుమాన్ చాలీసా పఠనం పూర్తయ్యాక.. శ్రీరాముని స్మరించుకోవాలి. ఆ తర్వాత పండ్లు, పలహారాలను సమర్పించాలి. 


హనుమాన్ చాలీసా పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు


1) హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.


2) హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా జపించడం ధైర్యం పెంపొందుతుంది. మనసులోని అనేక భయాలు తొలగుతాయి. 


3) మోక్షం కోసం హనుమాన్ చాలీసా పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. 


4) విద్యార్థులు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా చాలా విజయాలు సాధిస్తారు. వారి తెలివితేటలతో జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు.  


Also Read: Feb 8 2022 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!


Also Read: Vasantha panchami 2022: ఈ రోజే వసంత పంచమి- సరస్వతి పూజకు శుభముహూర్తం ఇదే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook