Vasantha panchami 2022: ఈ రోజే వసంత పంచమి- సరస్వతి పూజకు శుభముహూర్తం ఇదే..

Vasantha panchami 2022: రేపు వసంత పంచమి. ఈ రోజుకు (వసంత పంచమికి) అంత ప్రాధాన్యత ఎందుకు? ఎలాంటి పనులు చేయాలి? అనే వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 10:57 AM IST
  • ఫిబ్రవరి 5న వసంత పంచమి
  • చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలు
  • సరస్వతి పూజకు శుభ సమయం
Vasantha panchami 2022: ఈ రోజే వసంత పంచమి- సరస్వతి పూజకు శుభముహూర్తం ఇదే..

Vasantha panchami 2022: ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజును వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతిని మాతను పూజిస్తారు. ప్రాంతాల వారీగా ఈ పర్వదినాన్ని రకరకాల పేర్లతో జరుపుకుంటారు.

సరస్వతీ జయంతి, మదన పంచమి, శ్రీపంచమి పేర్లతో కూడా ఈ పర్వదినం ప్రాచుర్యం పొందింది.

సరస్వతి దేవికి సంబంధించిన పర్వదినం కావడంతో ఈ రోజు విద్యార్థులకు ముఖ్యమైన రోజుగా చెబుతుంటారు ఆధ్యాత్మిక గురువులు. కొందరు ఈ రోజు ఉపవాసం ఉంటారు మరికొందరు పేదలకు విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేస్తారు.

కాలాల్లోనూ మార్పులు..

సాధారణంగా వసంత పంచమి తర్వాత.. వాతావరణంలోనూ మార్పులు వస్తుంటాయి. ఈ రోజు తర్వాత చలికాలం ప్రభావం తగ్గి.. వేసవి కాలం ఆరంభం అవుతుంది.

వసంత పంచమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?

ఫిబ్రవరి 5 (శనివారం) ఉదయం 3.48 గంటలకు వసంత పంచమి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 3.46 గంటల వరకు ఉంటుంది.

వసంత పంచమి శుభ ముహూర్తం శనివారం ఉదయం 7.19 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 వరకు ఉంటుంది. ఈ 5 గంటల 28 నిమిషాల పాటు సరస్వతి పూజలు చేసేందుకు శుభ సమయాలుగా చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

వసంత పంచమి రోజు చేయాల్సిన. చేయకూడని పనులు..

  • వసంత పంచమి రోజున బ్మహ్మ చర్యాన్ని పాటించాలి
  • మనసులో ఎవరు పట్ల తప్పుడు బావన ఉండకూడదు
  • మాట్లాడే మాటల్లో దూషణ సంబందమైన పదాలను వాడకూడదు
  • మాసాహారాన్ని ముట్టుకోకూడదు. మద్యపానం సేవించరాదు
  • స్నానం చేయకుండా ఆహారం తినకూడదు
  • పసుపు రంగులో ఉన్న బట్టలు దరించడం వల్ల మేలు జరుగుతుంది
  • ఇది కాలం మారే రోజు కాబట్టి.. చెట్లను నరకడం, మెక్కలు పీకేయడం వంటివి చేయకూడదు.

Also read: Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..

Also read: Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది.. న్యూమరాలజీ ఏం చెబుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News