Feb 8 2022 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

Feb 8 Horoscope: రోజువారీ రాశి ఫలాలలో ఏఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏఏ రాశి వారిపై చెడు ప్రభావం ఉంది? అనే విషయాలను తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 12:49 PM IST
    • 2022 ఫిబ్రవరి 8 (మంగళవారం).. మీ రాశి ఫలాలు
    • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
    • ఆ రాశి వారికి డబ్బే.. డబ్బు!!
Feb 8 2022 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

Feb 8 Horoscope: నేటి (మంగళవారం 2022 ఫిబ్రవరి 8 ) రాశి ఫలాలను ఓసారి గమనిస్తే.. కొన్ని రాశుల వారికి మంచి సమయం ఉంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 

మేషరాశి (Aries)

ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబసభ్యులు సానూకూలంగా ఉంటారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థానచలనం లేదా పనిలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కోసం రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల మేలు కలుగుతుంది. 

అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: లేత పసుపు

వృషభరాశి (TAURUS )

ఈ రాశి వారి ఆర్థిక స్థితితో పాటు సమాజంలో కీర్తి పెరుగుతోంది. అంకిత భావంతో చేసిన పని మిమ్మల్ని మరింత స్థాయికి చేరుస్తుంది. ఈ రాశి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన డైట్ వాడడం మంచిది. పనులు వాయిదా వేయకండి. కొత్త విషయాలను ప్రయత్నించేందకు ఇదే సరైన సమయం. 

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: ఆకుపచ్చ

మిథునరాశి (GEMINI)

ఈ రాశివారికి నేడు అద్భుత ఫలితాలు అందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. సన్నిహితులను బాధపెట్టకుండా ఉండేందుకు మీ మాట, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యాన్ని విస్మరించవద్దు. ఈ రాశి కలిగిన విద్యార్థులు చదువుల్లో మంచిగా రాణిస్తారు. 

అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: లేత ఊదా

కర్కాటక రాశి (CANCER)

ఈ రాశి వారికి ఆర్థికంగా కొన్ని సమస్యలను వచ్చే అవకాశం ఉంది. వృత్తి పరంగా బదిలీ జరగవచ్చు. జంక్ ఫుడ్ తినడం సహా డీహైడ్రేషన్ మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. విద్యార్థులు అడ్డంకులను అధిగమించేందుకు ఎక్కువ ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. నేడు కొత్త ఇంటికి మారేందుకు అనుకూలంగా ఉంది. 

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: చాక్లెట్

సింహ రాశి (LEO)

ఈ రాశి వారు ఊహించని ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వృత్తి పరంగా మరిన్ని బాధత్యలను చేపట్టే అవకాశం ఉంది. కొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఇదే సరైన సమయం. విద్యారంగంలో ఉన్న వారు తమ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. 

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: ఆకుపచ్చ

కన్యా రాశి (VIRGO)

స్టాక్ మార్కెట్లో ఊహించని పరిణామాల కారణంగా మీ పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ ను మెరుగు పరుచుకునేందుకు.. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇదే అనువైన సమయం. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి. స్థిరాస్తి వ్యవహారాలు లాభం చేకూరుస్తాయి. 

అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: బేబీ పింక్

తులా రాశి (LIBRA)

ఈ రాశి వారు డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కంటే పెద్దవారితో మీరు సంభాషించేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ కెరీర్ లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రతిభకు పదును పెట్టే వేళ వచ్చింది. పనిపై నిబద్ధత కలిగిన వారితో కలిసి పని చేయడం వల్ల వృత్తిపరంగా మరింత ముందుకు వెళతారు. 

అదృష్ట సంఖ్య: 17
అదృష్ట రంగు: లావెండర్

వృశ్చిక రాశి (SCORPIO)

భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీలోని భయాందోళనలను పొగొట్టుకునేందుకు ధ్యానం చేయండి. విద్యార్థులు మరిన్ని విజయాలను సాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారు కొందరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎంత కష్టపడితే అంత అదృష్టవంతులవుతారు. 

అదృష్ట సంఖ్య: 22
అదృష్ట రంగు: టర్కోయిస్

ధనుస్సు రాశి (SAGITTARIUS)

ఈ రాశి వారిలోని సృజనాత్మక నైపుణ్యాల ద్వారా అదనంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇంట్లో వివాహం లేదా మతపరమైన వేడుకలను నిర్వహించేందుకు ఇదే మంచి రోజు. మీ కష్టానికి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారికి నేడు కొత్త అవకాశాలు దరిచేరే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది. 

అదృష్ట సంఖ్య: 17
అదృష్ట రంగు: లావెండర్

మకర రాశి (CAPRICORN)

ఈ రాశి వారు చేసే విపరీతమైన ఖర్చు కారణంగా ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉత్సాహంగా పనిచేసే విధానం ఇతరులను ప్రభావితం చేస్తుంది. పరిశోధనలు చేసే విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోకండి. 

అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: నిమ్మ

కుంభ రాశి (AQUARIUS)

మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లయితే డబ్బును తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఆస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన లావాదేవీలను జాగ్రత్తగా తూకం వేయాలి. విద్యార్థులు చదువులో అనుకున్నదానికంటే మెరుగ్గా రాణిస్తారు.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: ఆకుపచ్చ

మీనం (PISCES)

మీ సంపదను పెంచే కొన్ని మంచి ఆర్థిక అవకాశాలను మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇంటి పనుల్లో మీ సహాయాన్ని అందరూ మెచ్చుకుంటారు. విద్యార్ధులు తమ చదువులలో అదనపు ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ప్లాన్ చేయవచ్చు. 

అదృష్ట సంఖ్య: 15
అదృష్ట రంగు: రాయల్ బ్లూ. 

Also Read: Ratha Sapthami: తిరుమల చరిత్రలో తొలిసారిగా ఒకరోజుకు పరిమితం కానున్న రథసప్తమి వేడుకలు

ALso Read: Horoscope Today February 5 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమకాలం, చేదువార్తలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News