COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Karthika Pournami 2023: హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీకమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూర్వీకుల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఈరోజు నదీ స్నానాలను ఆచరించి దానధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసాన్ని ఉత్తరాది వ్యాప్తంగా దేవ్ దీపావళిగా కూడా పిలుస్తారు. అంతేకాకుండా కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా కూడా చెప్పుకుంటారు. ఈరోజు దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఉండే సమస్యలన్నీ దూరమవుతాయి.


ఈ కార్తీక పౌర్ణమి రోజున కాశీ విశ్వేశ్వరుని ఆలయం వద్ద భక్తులు లక్షలాది దీపాలను వెలిగిస్తారు. అందుకే దేవ్ దీపావళి అని పేరు వచ్చిందని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. రోజు సత్యనారాయణ వ్రతం కథను వినడం చాలా పుణ్యప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. సత్యనారాయణ గతను విని చంద్రునితో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆ ఆర్థికంగా బలపడతారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవారు తప్పకుండా నది స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి తేదీల్లో మార్పులు చేర్పులు వచ్చాయి. ఏయే తేదీల్లో కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కార్తీక పౌర్ణమి తేదీ, శుభ సమయాలు:
నవంబర్ 27వ తేదీన కార్తీక పౌర్ణమి శుభ సమయాలు ప్రారంభమవుతాయి.
కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభ సమయం: 26 నవంబర్ మధ్యాహ్నం 3:53 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
పౌర్ణమి తిథి ముగింపు సమయం: 27 నవంబర్ మధ్యాహ్నం 2 : 45 నిమిషాలకు ముగుస్తుంది.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


పూజా విధానం:
కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలనుకునేవారు ఉదయాన్నే నిద్ర లేవల్సి ఉంటుంది.
నిద్ర లేచి మీ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్లి నదీ స్నానం ఆచరించడం చాలా శుభప్రదం. ఇక నది స్నానం ఆచరించని వారు మీ ఇంట్లో ఉండే గంగాజలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని తలస్నానం చేయాల్సి ఉంటుంది.
స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించి గుడిలో దీపాన్ని వెలిగించాలి.
మీ ఇంట్లోని గుడిలో ఉన్న దేవతలను గంగాజలంతో అభిషేకం చేసి పూలు, గ్రంథంతో అలంకరించాలి.
ఆ తర్వాత లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు విగ్రహాలను పంచామృతాలతో అభిషేకం చేయాలి.
ఇలా అభిషేకం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువుకి తులసి మాలను సమర్పించి హారతిని ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత శ్రీమహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రత్యేక స్తోత్రాలను పారాయణం చేయాల్సి ఉంటుంది.
ఇలా చేసిన తర్వాత మీకు తోచినంత పేదవారికి సహాయం చేయడం చాలా మంచిది.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook