New Year 2021 Resolution : నూతన సంవత్సరం 2021 ప్రారంభం కానుంది. 2020 ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. కనీసం కొత్త సంవత్సరం అయినా బాగుండాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. వచ్చే సంవత్సరం అన్ని రకాలుగా బాగుండాలి అని ఆశిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..


లక్కు బాగుండాలి అంటే కోరికతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. దాని కోసం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది.కొత్త సంవత్సరం ఇంట్లో ఈ వస్తువులు లేకుండా చూసుకోండి


విరిగిన ఫర్నీచర్
విరిగిన ఫర్నీచర్ వంటి వస్తువులను న్యూఇయర్ (New Year 2021) సందర్భంగా ఇంట్లో లేకుండా చూసుకోండి. ఎందుకుంటే విరిగిన వస్తువులు ఇంట్లో ఉండటం అనేది మంచిది కాదంటారు. అందుకే వాడని, విరిగివ వాటిని వెంటనే తొలగించండి.


పాడైన వాహనం..
పాడైన వాహనం (Car) పార్కింగ్‌లో వదిలేస్తుంటారు కొంత మంది. పాడైన లేదా నడవని బండిని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో కలహాలు కలిగే అవకాశం ఉంది.



ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


పని చేయని ఎలక్ట్రిక్ వస్తువులు
వాడని ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం కన్నా.. వాటిని సేఫ్‌గా రీసైకిల్ చేసే సంస్థలకు ఇవ్వడం మంచిది. అలా ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు.


వీటిని ఇంట్లో ఉంచరాదు..
సగం విరిగిన విగ్రహాలు, చిరిగిన ఫోటోలు, పగిలిన అద్దాలు ఉంచుకోరాదు. వాటితో పాటు విరిగిన చెప్పులు, చిరిగిన షూస్ వాడటం మంచిది కాదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook