Planet Transits 2022: గ్రహాల రాశిచక్రంలో మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల సంయోగం ఏర్పడినప్పుడు ఈ ప్రభావం మరిన్ని రెట్లు పెరుగుతుంది. ఈ నెల 18న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే పంచ మహాపురుష రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం 4 రాశుల వారికి చాలా శుభప్రదం. పంచ మహాపురుష రాజయోగంలో ఆ నాలుగు రాశుల వారిని అదృష్టం వెంటాడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచ మహాపురుష రాజయోగం :


బుధ గ్రహం ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. జూన్ 18న శుక్ర గ్రహం కూడా వృషభ రాశిలోకి ప్రవేశించింది. అదే సమయంలో శని గ్రహం 30 సంవత్సరాల తర్వాత దాని స్వంత త్రిభుజ రాశిచక్రం కుంభంలో సంచరిస్తోంది. దీనివల్ల 4 రాశుల సంచార జాతకంలో పంచ మహాపురుష యోగం ఏర్పడుతోంది.


వృషభం : వృషభ రాశి వారి జాతకంలో 2 మహాపురుష రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది ఈ రాశి వారికి కెరీర్‌కు బాగా దోహదపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారి ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి. మహాపురుష రాజయోగంలో డబ్బుతో పాటు పలుకుబడి పెరుగుతుంది.


సింహం: సింహ రాశి వారి జాతకంలో 2 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. చేపట్టే ప్రతీ పనిలో ఇది గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది. విదేశాలకు ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.


వృశ్చికం: ఈ రాశి వారి జాతకంలో 2 మహాపురుష రాజయోగాలు ఏర్పడుతున్నాయి. కొత్త ఉద్యోగం, పదోన్నతులు, జీతాల పెంపుదల ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారాలలో గొప్ప విజయాన్ని పొందుతారు. భవిష్యత్తులో చాలా ప్రయోజనం కలిగించే పెద్ద ఒప్పందం జరగవచ్చు. ఈ కాలంలో అన్నివిధాలా కలిసొస్తుంది.


కుంభం: కుంభ రాశి వారి సంచార జాతకంలో కూడా మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం వారికి భౌతిక ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



Also Read: Horoscope Today June 20th: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి  


Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ యూ టర్న్! టీడీపీలో పరేషాన్.. అంతా ఆయనవల్లేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook