Horoscope Today June 20th: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today June 20th 2022: ఈరోజు సోమవారం. ఈ రోజున శంకరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల స్థితిగతులను జ్యోతిష్యుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2022, 06:33 AM IST
  • ఇవాళ మేష, తుల, మీన తదితర రాశుల వారికి శుభవార్తలు అందుతాయి
  • సింహ రాశి వారికి ఇవాళ కొంత హడావుడి ఉంటుంది
  • ఇవాళ్టి రాశి ఫలాలను జ్యోతిష్యుడు ప్రసన్నాచార్య అందిస్తున్నారు
Horoscope Today June 20th: నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today June 20th 2022: ఇవాళ సోమవారం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం శంకరుడిని పూజిస్తారు. ఆ పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితం అన్నివిధాలా ఆనందమయంగా ఉంటుంది. ఇవాళ రాశిచక్రంలోని 12 రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి (Aries)

ఇవాళ కొన్ని శుభవార్తలతో మీరోజు ప్రారంభమవుతుంది. కుటుంబమంతా ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది.వ్యాపార వర్గాలకు అనుకూల సమయం. అనుకోని లాభాలు చవిచూస్తారు. ఈ రోజు మీరు మీ ప్రేమికుడి నుంచి బహుమతి పొందే అవకాశం ఉంటుంది.

వృషభ రాశి (Taurus)

మీరు చేపట్టే పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో కలిసి షికారుకు వెళ్తారు. స్తిరాస్థి సంబంధిత వ్యాపారంలో కొనుగోలు, విక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిపక్షంలో నష్టపోతారు. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మోసపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

మిథున రాశి (GEMINI)

ఈరోజు ప్రారంభించిన కొత్త ప్రాజెక్ట్ లాభదాయకంగా ఉంటుంది. మీ నుంచి అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. దీంతో కుటుంబంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. అందరిలో సంతోషం పెరుగుతుంది. వ్యాపార పరంగా ఈరోజు మంచి రోజు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు.

కర్కాటక రాశి (Cancer) 

ఈరోజు మీకు మిశ్రమ ఫలవంతమైన రోజు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు సాయంత్రం కుటుంబ సమేతంగా మతపరమైన ప్రదేశానికి వెళ్లవచ్చు. మీరు లవ్‌మేట్ నుండి బహుమతిని పొందవచ్చు.

సింహ రాశి (LEO)

ఇవాళ హడావుడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఖర్చులను అదుపులో ఉంచుకోండి. లేనిపక్షంలో మీరు అప్పుల పాలవుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇవాళ అందుకు అనుకూలమైన రోజు. అందులో తగిన లాభం పొందుతారు. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధాలు వస్తాయి.

కన్య రాశి (Virgo)

వ్యాపార పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో వాగ్వాదం రావచ్చు. ఖర్చులను నియంత్రించండి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి.

తులా రాశి (Libra)

ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. జాగ్రత్తగా ఉండండి, భాగస్వామ్యంతో చేసే వ్యాపారం హానికరం. ఈ రాశికి చెందిన వివాహితులు అత్తమామల వైపు నుండి బహుమతి పొందవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)

ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదురుకావచ్చు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. సీనియర్ అధికారుల సహకారంతో ఉద్యోగ పురోగతి సాధ్యమవుతుంది. సాయంత్రం వేళ ఏదైనా శుభకార్యక్రమంలో స్నేహితులతో కలిసి పాల్గొనవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణ రోజు.

ధనుస్సు రాశి (Sagittarius)  

మీరు ఈరోజు ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రియురాలు లేదా ప్రియుడి నుంచి సర్‌ప్రైజ్ ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు.

మకర రాశి (Capricorn) 

ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నష్టం వాటిల్లవచ్చు. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. మానసిక కలవరం వెంటాడుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి (Aquarius)

కుటుంబంలో దైవపరమైన కార్యక్రమాలు చేపడుతారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది. వ్యాపారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. సాయంత్రం వేళ ఏదైనా ఆలయానికి వెళ్తారు. లవ్‌మేట్‌తో వాగ్వాదం జరగవచ్చు.

మీన రాశి (Pisces) 

ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపార ప్రణాళిక ఫలవంతంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. లవ్‌మేట్‌తో సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకుంటారు.

Also Read: International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, అందమైన క్వొటేషన్లు

Also Read: Etela Meet to Amith shah: అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ..త్వరలో కీలక పార్టీ పదవి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News