సూర్యుడిని హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు రాజుగా పిలుస్తారు. సూర్యుడు ఏ రాశిలో పరివర్తనం చెందినా..చాలా రాశుల జీవితాల్లో వసంతం వెల్లివిరుస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇప్పుడు సూర్యుడి కుంభరాశి ప్రవేశం, శని గ్రహంతో యుతి కారణంగా 3 రాశులపై అద్భుతమైన కటాక్షం కురవనుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 13 వతేదీ ఉదయం 9 గంటల 57 నిమిషాలకు కుంభరాశిలో సూర్యుడి గోచారం జరగనుంది. అదే సమయంలో ఆ కుంభరాశిలో అప్పటికే ఉన్న శనిగ్రహంతో సూర్యుడి కలయికతో యుతి ఏర్పడనుంది. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల యుతి కారణంగా..3 రాశుల దశ మారనుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతర వివరాలు మీ కోసం..


సూర్య గోచారం 2023తో ఏయే రాశులకు లాభం


ధనస్సు రాశి


సూర్యుడి కుంభరాశి ప్రవేశం వల్ల ధనస్సు రాశివారికి అదృష్టం వరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లభించవచ్చు. సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. పూర్తిగా కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. తండ్రి సహాయం తప్పకుండా తీసుకోవాలి. దీంతో లాభముంటుంది. సూర్యుడి ప్రభావం పెంచేందుకు రోజూ సూర్యుడిని నీటితో అభిషేకం చేయాలి.


కన్యారాశి


గ్రహాల రాజు సూర్యుడి గోచచారం వల్ల సమాజంలో ఈ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు కష్టపడినదానికి తగిన ప్రతిఫలం లభించే సమయం వచ్చేసింది. ప్రత్యర్దులు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రల్ని మీరు మీ తెలివితేటలు, బుద్ధితో తిప్పికొడతారు. ఉద్యోగస్థులకు బాధ్యతలు లభిస్తాయి. మీ వైఖరి, పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ ప్రభావం బాగుంటుంది. 


వృషభ రాశి


సూర్యుడి గోచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ రాశివారికి  చాలాకాలంగా ఉద్యోగమార్పు కోసం చూస్తుంటారు. ఆ కోరిక నెరవేరుతుంది. ఏదైనా పెద్ద కంపెనీలో మీకు మంచి ఆఫర్ లభించవచ్చు. వ్యాపార సంబంధిత వ్యక్తులు మార్చ్ 15 వరకూ పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తారు. అద్దె ఇంటిని వదిలిపెట్టి..సొంత ఇంటికి వెళ్తారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. 


Also read: Surya Shani Yuti 2023: శివరాత్రికి ముందే ఆ రెండు గ్రహాల యుతి, 3 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook